శనివారం 04 ఏప్రిల్ 2020
Peddapalli - Jan 20, 2020 , 02:10:11

కారు గుర్తుకు ఓటేయండి

కారు గుర్తుకు ఓటేయండి



కలెక్టరేట్‌: కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే  సతీమణి పుష్పలతారెడ్డి ఓటర్లను కోరారు.  ఆదివారం 4వ వార్డులో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి అడవెల్లి చంద్రారెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రతి గడపనూ తడుతూ మహిళలకు బొట్టు పెట్టి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పుట్టబోయే బిడ్డ నుంచి  ముసలి వరకు పలు సంక్షేమ పథకాలతో ఆదుకుంటూ ఆసరా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాల్సిన అవసరం ఉందని వివరించారు. అందుకోసం మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.

27వ వార్డు అభివృద్ధ్దే ధ్యేయం

పెద్దపల్లి జంక్షన్‌: వార్డు అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని 27వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఉను కొండ సుజాత-సునీల్‌ పేర్కొన్నారు.  ఆ వార్డు పరిధిలోని సుభాష్‌నగర్‌, కమాన్‌రోడ్‌, పల్లె వా డల్లో ఆదివారం ఆమె ఇంటింటా ప్రచారం  నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలక రిస్తూ, టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డులోని ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. వార్డు ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అవినీతికి పాల్పకుండా, వార్డు అభివృద్ధికి అధిక నిధులు కేటాయించేలా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సహకారం తీసుకుంటానని తెలపారు. అలాగే ప్రతి ఇంటికీ నల్లా కలెక్షన్‌ ఇప్పించి తాగునీటి సమస్యను తీరుస్తానన్నారు. ప్రచారంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు గండు రంగయ్య, ఇక్బాల్‌, సోల్లూరి మల్లయ్య, ఉనుకొండ రాయమల్లు, కబీర్‌, మేడి సమ్మయ్య పార్టీ అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

నిస్వార్థంగా సేవలు అందిస్తా..

పెద్దపల్లి జంక్షన్‌: పెద్దపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్‌గా తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా సేవలు అందిస్తానని 26వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుదమళ్ల అమ్రేశ్‌ పేర్కొన్నారు. వార్డు పరిధిలోని మొమిన్‌పురా, కమాన్‌రోడ్‌లో ఆదివారం ఎన్నిక ల ప్రచా రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రచారంలో భాగంగా ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. కొత్త ఇళ్ల పర్మిషన్‌ కొరకు ఎలాంటి లంచాలు లేకుండా అనుమతులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధే లక్ష్యంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేస్తానని పేర్కొన్నారు. వార్డు ప్రజలు ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి మెజార్టీని అందించాలని కోరారు.

సంక్షేమ ఫలాలు అందిస్తాం..

పెద్దపల్లి టౌన్‌: పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని 17వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొలిపాక సంధ్య-చిరంజీవి అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చిట్టేటి రాంరెడ్డి, కొలిపాక శ్రీనివాస్‌తో కలిసి చందపల్లి, పెద్దమ్మవాడలో అభ్యర్థి కొలిపాక సంధ్య-చిరంజీవి ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తూ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పేదల కోసం పింఛన్లు, రైతుబంధు, తాగు, సాగునీరు అందజేస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని వివరించారు. ఈ నెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఊపందుకున్న ప్రచారం

సుల్తానాబాద్‌ :  సుల్తానాబాద్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం ఊపందుకుంది. రేపటితో ప్రచారానికి చివరి రోజు కావడంతో ర్యాలీలు, ఇంటింటా ప్రచారాలు కొనసాగుతున్నాయి. 1వ వార్డులో పసెడ్ల మమత సంపత్‌, 2వ వార్డులో గాజుల లక్ష్మి రాజమల్లు, 3వ వార్డులో అయిల రాధారమేశ్‌, 5వ వార్డులో పారుపెల్లి జ్ఞానేశ్వరి, 7వ వార్డులో కూకట్ల గోపి, 13వ వార్డులో కోట రంగారెడ్డి, 14వ వార్డులో గుర్రాల శ్రీనివాస్‌, 15వ వార్డులో ముత్యం సునీత రమేశ్‌గౌడ్‌ తమ ప్రచారాలను కొనసాగించారు. ఇంటింటికీ వెళ్లి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ, ఓట్లను అభ్యర్థిస్తున్నారు.


logo