తల్లిదండ్రుల మంచి చెడులను వారి పిల్లలు కూడా వారసత్వంగా కొనసాగిస్తున్న సందర్భంలో వాడే సామెత ఇది. ఏ విత్తనం నాటితే, ఆ చెట్టు పురుడు పోసుకున్నట్లే.. తల్లిదండ్రుల అలవాట్లు పిల్లలకు కూడా వస్తాయని అంటారు. తల్లిదండ్రులు దుర్మార్గులు అయితే, పిల్లలు కూడా అదే బాటలో నడుస్తూ.. సమాజానికి కీడు తలపెడుతున్నప్పుడు ఈ సామెతను ప్రయోగిస్తారు. ‘ఆవు పొలంలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా?’,
‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు’ వంటి సామెతలూ ఇలాంటివే. అందుకే తల్లిదండ్రులు సాధ్యమైనంత వరకూ మంచి పనులే చేయాలని, పిల్లలకు చిన్నతనం నుంచే మంచి చెడులు వివరించాలని హితవు పలుకుతుంటారు పెద్దలు.