మంచీచెడు తెలుసుకోకుండా వంతపాడేవాళ్లను గుడ్డిగా నమ్మేవారిని ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. ఇలాంటి స్వభావం ఉన్నవారికి ఆత్రం (తొందర) ఎక్కువ. కాసేపు కూడా తీరిగ్గా ఆలోచించుకోరు. ప్రతి విషయంలోనూ ఇతరులను నమ్ముతుంటారు. వారు చెప్పిందే వేదం అన్నట్లు ప్రవర్తిస్తారు. ఇలాంటివాళ్లు అన్ని కాలాల్లోనూ తారసపడుతుంటారు. ‘దున్నపోతు ఈనింది రా’ అని ఒకడంటే.. ‘వెళ్లి దుడ్డె(పిల్ల)ను కట్టెయ్యి రా’ అని అన్నాడట మరొకడు అనాలోచితంగా. గేదె ఈనడం ప్రకృతి ధర్మం.. దున్నపోతు ఈనడం అసాధ్యం. కనీస విషయ పరిజ్ఞానం లేని వ్యక్తులకు సరిపోలే ఇలాంటి సామెతలెన్నో చెప్పారు జానపదులు.
-డప్పు రవి