అతడు పండుటాకులకు కుండలో మెతుకు
ఆయన బక్క పలచని మనిషే కావచ్చు కానీ, రాష్ట్ర కాంక్షను ఎవరెస్టుపై ఎగరేసిన సైనికుడతడు మాటల ఈటెలను విసిరే మనిషే కావచ్చు కానీ, రాజకీయ కడలిని చిలికిన చాణక్యుడతడు ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసే కత్తి అతడుc
ఆయన బక్క పలచని మనిషే కావచ్చు కానీ,
రాష్ట్ర కాంక్షను ఎవరెస్టుపై ఎగరేసిన సైనికుడతడు
మాటల ఈటెలను విసిరే మనిషే కావచ్చు కానీ,
రాజకీయ కడలిని చిలికిన చాణక్యుడతడు
ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసే కత్తి అతడు
పరాయి పాలనపై నిప్పుల కొలిమిని రాజేసి
సబ్బండవర్గాలను సమరానికి మళ్లించిన నేత
మృత్యుకుహరంలోకి శిరస్సును ఒంపి
ఉద్యమానికి ఊపిరులూదిన ఉప్పెనతడు
రాలిపోయే పండుటాకులకు పెద్ద కొడుకై
వారికిప్పుడు కుండలో మెతుకైతాండు
నీళ్లు లేక కరెంటు రాక అరిగోస పడి
కూలిపోతున్న రైతన్న గుండెలకు
రైతుబంధుతో నిట్టాడై నిలబడతాండు
పొంగిపొర్లుతున్న గోదారమ్మకు తన
ఆలోచనను అడ్డేసి నెర్రబారిన నేలలకు దాహాన్ని తీర్చాడు
తుప్పలతో నిండిపోయిన బీడు భూముల్లో
నేడు రతనాల రాశులకు కేరాఫ్ అయ్యాడు
మసకబారిన నేలను హరితహారంతో
పుడమి తల్లికి పచ్చని చీరను కట్టాడు
పేద పిల్లల పెండ్లిల్లకు పెద్ద మనిషి అయి
కల్యాణలక్ష్మీ ,షాదీ ముబారక్‌లతో
పసుపు కుంకుమలై ఆనందాల సింగిడిని
మంటపంలో పరుస్తున్నాడు
నేతన్నకు, గీతన్నకు సకల కులాలకు
ఊతమిస్తున్నాడు
ఇప్పుడు నాలుగు కోట్ల ప్రజల నాలుకతడు
తెలంగాణ మాండలికానికి మాతృక అతడు
సర్వమతాలకు చైతన్యగీతిక అతడు…
– తాటిపాముల రమేశ్, 79815 66031
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

