పట్టుదలకు పోయి ప్రజలపై కరువు భారం
రాష్ట్రంలో వర్షాకాలంలో నాలుగు నెలలు ఎక్కడా నీటి లభ్యత లేకపోయినా దిగువ గోదావరిలో మాత్రం 25 వేల క్యూసెక్కులకు తగ్గకుండా 7 లక్షల క్యూసెక్కుల దాకా ప్రవాహాలు నమోదైన సంగతి మనకు తెలుసు, ప్రభుత్వానికీ తెలుసు. మేడిగడ్డ వద్ద ప్రవాహాలు ఈ రకంగా ఉంటే, ఎగువన శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కుమ్రం భీం లాంటి మీడియం ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహాల జాడనే లేదు. ఇక వానలు పడి వరదలు వస్తాయని ఆశించే ప్రభుత్వమైనా, మరెవరైనా ప్రస్తుతం రాష్ట్రంలో వర్షపాతం ఎట్లా ఉన్నది?
రాష్ట్రంలో వర్షాకాలంలో నాలుగు నెలలు ఎక్కడా నీటి లభ్యత లేకపోయినా దిగువ గోదావరిలో మాత్రం 25 వేల క్యూసెక్కులకు తగ్గకుండా 7 లక్షల క్యూసెక్కుల దాకా ప్రవాహాలు నమోదైన సంగతి మనకు తెలుసు, ప్రభుత్వానికీ తెలుసు. మేడిగడ్డ వద్ద ప్రవాహాలు ఈ రకంగా ఉంటే, ఎగువన శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కుమ్రం భీం లాంటి మీడియం ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహాల జాడనే లేదు. ఇక వానలు పడి వరదలు వస్తాయని ఆశించే ప్రభుత్వమైనా, మరెవరైనా ప్రస్తుతం రాష్ట్రంలో వర్షపాతం ఎట్లా ఉన్నది?
రాబోయే రోజుల్లో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అంచనాలు ఎట్లా ఉన్నాయి? అనే విషయాలను పరిశీలించాలి.
రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో 20 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ ఈ ఏడాది జూలైలోనే హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆశించిన రీతిలో జలాశయాలు, చెరువుల్లోకి నీరు చేరే స్థితి ఉండదని ప్రభుత్వం ఎందుకు ఊహించలేకపోయింది? వర్షాకాలం ముగిసిన తర్వాత రాష్ట్రంలో లోటు వర్షపాతం 23%గా నమోదైంది. సాధారణ వర్షపాతం 795.7 మి.మీ. కాగా, కేవలం 615.8 మి.మీ. మాత్రమే కురిసింది. వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రభుత్వం బేఖాతరు చేసి దిగువ గోదావరిలో మాత్రమే లభ్యమవుతున్న నీటిని వదిలేయడాన్ని ఏమనాలి?
ప్రతిపక్షాలు, రైతులు, ఇంజినీర్లు కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని ఎంత మొత్తుకున్నా పాలకులు ఎన్డీఎస్ఏ సాకు చూపించి నీటిని కిందికి వదిలేశారు. ఈ సీజన్లో మేడిగడ్డ బరాజ్ నుంచి ఆంధ్రాకు ప్రవహించిన నీరు 734 టీఎంసీలని కేంద్ర జల సంఘం రికార్డులు చెప్త్తున్నాయి. ఆ నీటిలో 200 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా డెల్టా భూములకు తరలించి ఇంతటి కరువుకాలంలో కూడా 25 లక్షల ఎకరాల్లో పంటలను కాపాడుకోగలిగింది. నీళ్లు ఉండి కూడా శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో క్రాప్ హాలిడే ప్రకటించింది మన సర్కార్. కాళేశ్వరం రాడార్ లోకి వచ్చే సుమారు 10 వేల చెరువులను నింపి, వాటి కింద ఆయకట్టును కూడా కాపాడలేకపోయింది. మన కంటే ఎక్కువ లోటు వర్షపాతం ఉన్నా ఏపీలో ఒక్క ప్రాజెక్టు కింద కూడా క్రాప్ హాలిడే లేదు. ఎందుకంటే మనం వాడుకోకుండా వదిలేసిన నీటిని ఆ రాష్ట్రం సద్వినియోగం చేసుకున్నది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద క్రాప్ హాలిడే ప్రకటిస్తే, కుడి కాలువ కింద లేకపోవడం ఎంత విచిత్రం!
కన్నేపల్లి పంపులను ఆన్ చేసి మేడిగడ్డ బరాజ్ నుంచి కిందికి పోతున్న గోదావరి ప్రవాహాలను ఎత్తిపోయాల్సి ఉండగా కాంగ్రెస్ సర్కార్ మొండికి పోయింది. మన ప్రభుత్వం వద్ద కరువును ఎదుర్కోవడానికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? ఉంటే ప్రజల ముందు పెట్టండి అంటే..ఆ విషయంలో కాంగ్రెస్ సర్కార్ మౌనం పాటించింది. ప్రకృతి
కరుణిస్తుందని ఆశ పడినా సూపర్ ఎల్ నినో ప్రభావం వలన ఆ ఆశలు అడియాసలయ్యాయి.
అన్నారం, సుందిళ్ల జలాశయాల్లోకి నీటిని ఎత్తిపోయవచ్చునని, అందువల్ల వాటికి ఏ ప్రమాదమూ సంభవించే అవకాశం లేదని మన పాలకులు తప్ప అంతా నమ్మారు. వరంగల్ ఎన్ఐటీ సీనియర్ ప్రొఫెసర్, ఇంజినీర్లకు పరమ గురువు ప్రొ.పీజీ శాస్త్రి కూడా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం రిస్క్ తీసుకొనైనా నీటిని ఎత్తిపోయాలని సూచించారు. ప్రభుత్వ అనుమానాలు ఏవీ నిజం కావని ఈ ఏడాది ఆగస్టులో పుణెలోని ప్రతిష్టాత్మక సంస్థ సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ కాళేశ్వరం బరాజ్‌ల పటిష్టతపై సమర్పించిన నివేదిక ధ్రువీకరించింది. మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్ల కుంగుబాటు సంభవించిన బ్లాక్ 7లో తప్ప మిగతా అన్ని బ్లాకుల్లో పిల్లర్లు పటిష్టంగానే ఉన్నాయని వివిధ రకాలైన కాంక్రీట్ పరీక్షల ద్వారా వారు ధృవీకరించారు. అన్నారం, సుందిళ్ల బరాజుల్ల్లో పిల్లర్ల నాణ్యత ‘ఎక్సలెంట్’ అని అదే సంస్థ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రభుత్వం కాస్తంత ఇంగితజ్ఞానం ప్రదర్శించలేదు. రాష్ట్రంలో నెలకొన్న కరువును దృష్టిలో ఉంచుకొని కన్నేపల్లి పంపులను ఆన్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి, అక్కడ నుంచి పైన ఉన్న మిడ్ మానేరు, లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ జలాశయాలు, 10 వేల చెరువులను నింపడానికి నీటిని ఎత్తిపోసి ఉంటే ఈ రోజు సాగు, తాగునీటి సంక్షోభం ఎదుర్కొనే అవసరం ఉండేది కాదు. ప్రభుత్వం ఆ అద్భుతమైన అవకాశాన్ని జారవిడిచి ఇప్పుడు నెపాన్ని ఎల్ నినో మీదకి నెట్టి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నది. నీళ్లు, కరెంట్ సరఫరా చేయలేమని, రైతులను యాసంగి పంటలు వేయవద్దని సర్కార్ ఇప్పుడు ప్రాధేయపడుతున్నది. ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదని, ప్రభుత్వం మొండికిపోయి ప్రజల మీద రుద్దిన కరువని తెలిసిపోతూనే ఉన్నది.
ఎల్ నినో ప్రభావాలు ఉన్న ఈ కాలంలో కూడా దిగువ గోదావరిలో ప్రవాహాలు నమోదవుతున్న సంగతి చూశాం. ప్రతి సంవత్సరం 1,500 నుంచి 3,000 టీఎంసీల గోదావరి నీరు నిరుపయోగంగా సముద్రంలో కలిసిపోతున్నాయని అంటున్నా ఈ నీరంతా గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి, శబరీ నదులు కలిసిన తర్వాతనే అనే విషయం గమనార్హం. అంటే గోదావరిలో భారీ ప్రవాహాలన్నీ పెన్‌గంగా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి సబ్ బేసిన్ల నుంచి దిగువ గోదావరి బేసిన్‌లోకి వస్తున్నవే. గోదావరిలో నీరు లభ్యమయ్యేది ప్రాణహిత-గోదావరి సంగమ ప్రాంతమైన కాళేశ్వరం తర్వాతనే.
ఎల్ నినో ప్రభావాలు ఉన్న ఈ కాలంలో కూడా దిగువ గోదావరిలో ప్రవాహాలు నమోదవుతున్న సంగతి చూశాం. ప్రతి సంవత్సరం 1,500 నుంచి 3,000 టీఎంసీల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని అంటున్నా ఈ నీరంతా గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి, శబరీ నదులు కలిసిన తర్వాతనే అనే విషయం గమనార్హం. అంటే గోదావరిలో భారీ ప్రవాహాలన్నీ పెన్‌గంగా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి సబ్ బేసిన్ల నుంచి దిగువ గోదావరి బేసిన్‌లోకి వస్తున్నవే. గోదావరిలో నీరు లభ్యమయ్యేది ప్రాణహిత-గోదావరి సంగమ ప్రాంతమైన కాళేశ్వరం తర్వాతనే. ఎల్ నినో ప్రభావాలు లేనప్పుడు కూడా ప్రాణహిత కలిసిన తర్వాత దిగువ గోదావరి సబ్ బేసిన్లో కాళేశ్వరం వద్ద సీడబ్ల్యూసీ నమోదు చేసిన 40 ఏండ్ల నాటి ప్రవాహాలను గమనిస్తే ప్రతి ఏటా సగటున 1,651 టీఎంసీల ప్రవాహాలు ఉంటాయని తెలుస్తున్నది. నెల వారీగా చూస్తే..జూన్‌లో 50.90 టీఎంసీలు, జూలైలో 299.90, ఆగస్టులో 607.10, సెప్టెంబర్‌లో 423.80, అక్టోబర్‌లో 176.20 టీఎంసీలు నీళ్లు ఉంటాయని తెలుస్తున్నది. అక్టోబర్ తర్వాత డిసెంబర్ దాకా ఎంతో కొంత ప్రవాహాలు ఉంటాయి. కన్నేపల్లి ఇన్‌టేక్ దిగువన రింగ్ బండ్ వేసుకోగలిగితే వీటిని కూడా ఎత్తిపోసుకోవచ్చు. ఈ ప్రవాహాలను అధ్యయనం చేసిన తర్వాతనే రీ-ఇంజినీరింగ్‌లో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఈ ఏడాది నెలకొన్నలాంటి కరువులకు ఇంజినీరింగ్ పరిష్కారమే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లింక్-1 సరఫరా వ్యవస్థ.
ప్రభుత్వం ఇప్పుడున్న ఎల్ నినో ప్రభావాన్ని, వాతావరణ శాఖ భవిష్యత్ అంచనాలను దృష్టిలో పెట్టుకొని జనవరి వరకు దిగువ గోదావరిలో లభ్యమయ్యే 15 నుంచి 20 వేల క్యూసెక్కుల యాసంగి ప్రవాహాలను ఎత్తిపోసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి.
2024లోనే ప్రాజెక్టు ఇంజినీర్లు కన్నేపల్లి ఇన్‌టేక్‌కు దిగువన 100 మీటర్ల పొడవునా రబ్బర్ డ్యామ్‌ను నిర్మిస్తే కన్నేపల్లి ఇన్‌టేక్ వద్ద అవసరమైన 93.5 మీటర్లకు పైన నీటి మట్టాన్ని పెంచుకొని పంప్‌హౌస్ ఫోర్ బేలోకి నీటిని మళ్లించవచ్చునని ప్రభుత్వానికి సూచించారు. రబ్బర్ డ్యామ్ నిర్మాణ ఖర్చు కేవలం రూ.8 కోట్లేనని వారు అంచనా వేశారు. కారణాలు ఏవైనా ప్రభుత్వం ఆ నివేదికను బుట్టదాఖలు చేసింది. ఇప్పుడైనా ఆ నివేదికను వెలికితీసి జనవరి వరకు దిగువ గోదావరిలో లభ్యమయ్యే ఈ యాసంగి ప్రవాహాలను ఎత్తిపోసుకుంటే కనీసం తాగునీటి సంక్షోభాన్ని నివారించవచ్చు. కవి, గాయకుడు, అమరుడు సదాశివుడు రాసిన ‘తలాపున పారుతుంది గోదారి-మన చేను, మన చెలక ఎడారి’ పాటను మళ్లీ పాడుకునే అగత్యాన్ని నివారించుకోవచ్చు.
(వ్యాసకర్త: విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్, సాగునీటి శాఖ
శ్రీధర్ రావు దేశ్ పాండే
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

