అన్ననేమో ‘పీసీసీ అధ్యక్షుడు, గిధ్యక్షుడు జన్తానహీ’ అంటే.. తమ్ముడేమో ఏకంగా ‘రాహుల్ గాంధీ నాకో లెక్కా’ అనేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటనకు వస్తే బహిష్కరించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కంటే ఆయన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్టున్నారు. రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనకు దూరంగా ఉంటానని పార్టీ శ్రేణులకు బాహాటంగానే వెల్లడించారు. మాజీ ఎంపీని కూడా అయిన తనకు శాసనసభలో పార్టీ ఫ్లోర్‌లీడర్ పదవి ఇవ్వకుండా నిరాకరించిన రాహుల్‌గాంధీని తానెందుకు గౌరవించాలని టీపీసీసీ నాయకత్వాన్నే రాజగోపాల్‌రెడ్డి నిలదీసినట్టు గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.