అధికారంలో ఉన్న వారు గడువు ముగియక ముందే శానససభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే ముందస్తు అంటారు. కానీ తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ముందస్తుకు వెళ్లే ప్రసక్తి లేనే లేదని పదే పదే స్పష్టంగా చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం ముందస్తు అంటూ హడావుడి చేస్తున్నాయి. అధికారంలో ఉన్న వారు వెళ్తే ముందస్తు అంటారు.. మరి ప్రతిపక్షాలు ముందస్తుకు వెళ్లడాన్ని ఏమంటారో రాజనీతిజ్ఞులే చెప్పాలి. వాళ్లు చెప్పే వరకు బొక్క బోర్లా పదంతో మనం సరిపెట్టుకుందామా?