వెనకా ముందూ పిడికెడు జనం లేకున్నాపిడికిలెత్తిన దినం!
అంతులేని ఆత్మవిశ్వాసంతో సువిశాల గులాబి తోటను అందంగా కలగన్న దినం!
ఆరిపోయిన ఆరు దశాబ్దాల కలకు ప్రాణదీపం వెలిగించిన దినం!
ఎవరూహించారు చెప్పు మన కళ్ల ఎదుటే ఓ సామూహిక కల సాకారమౌతుందని?!
కోటి ఎకరాల మాగాణం ఇది ఇప్పుడు ఊహ కాదు దేశం కళ్లార్పకుండా చూస్తున్న నిజం!
మాట మంత్రమై సకల జనుల నోట జై తెలంగాణ నినాదం హోరెత్తిన దినం!
తెగింపు కోట్లాటకు స్వేచ్ఛా పతాకానికి అంకురార్పణ చేసిన దినం!
ఇది గులాబి జెండావిర్భావ దినమే కాదు దేశానికి దిశానిర్దేశం చేసే భరోసా ప్రతీక దినం!!
-కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261