తెలంగాణలో పాలిటెక్నిక్ విద్య ప్రస్తుతం ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. ప్రభుత్వం పాలిటెక్నిక్‌లు, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ)ని యంగ్ ఇండియా సిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్‌యూ)లో విలీనం చేయాలని జీవో 97లోని క్లాజ్ ఐబీ ద్వారా ప్రతిపాదిస్తున్నది. ఈ నిర్ణయం విద్యార్థులు, అధ్యాపకులు, విద్యారంగ నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఇది కేవలం పరిపాలనా మార్పు కాదు…దాదాపు 70 ఏండ్ల వారసత్వం, చట్టబద్ధమైన హకులు, ఏఐసీటీఈ, ఎన్బీఏ గుర్తింపు పొందిన డిప్లొమా వ్యవస్థ, ప్రజా ఆస్తులు అన్నింటిపై ప్రభావం చూపే అంశం.
ఎస్బీటీఈటీ 1957 ఫిబ్రవరి 26న ఏర్పడింది. ఆ రోజుల్లోనే సాంకేతిక విద్య అభివృద్ధికి ప్రత్యేక బోర్డు అవసరమని గుర్తించి, జీవోఎంఎస్ నం.371 ద్వారా దీనిని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎస్బీటీఈటీ డిప్లొమా స్థాయి సాంకేతిక విద్యకు మూలస్తంభంగా నిలిచింది. ఎస్బీటీఈటీకి తెలంగాణ విద్యా చట్టం, 1982 సెక్షన్ 6 కింద స్పష్టమైన చట్టబద్ధ హోదా ఉన్నది. ఈ సెక్షన్ ప్రకారం బోర్డు విధులుడిగ్రీ స్థాయికి దిగువ సాంకేతిక విద్య అభివృద్ధికి సలహా ఇవ్వడం, సంస్థలకు అనుబంధం కల్పించడం, పాఠ్యప్రణాళిక నిర్ణయించడం, తనిఖీలు నిర్వహించడం, ఏఐసీటీఈ ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించి డిప్లొమాలు జారీ చేస్తుంది. ఈ చట్టం కిందే విద్యార్థులు డిప్లొమా గుర్తింపు, ప్రమాణాలు, భవిష్యత్తు అవకాశాలపై రక్షణ పొందుతున్నారు. ఈ వ్యవస్థను మార్చేటప్పుడు ఈ చట్టబద్ధ హకులను కాపాడకపోతే విద్యార్థులు నష్టపోతారు.
యంగ్ ఇండియా సిల్స్ వర్సిటీ (వైఐఎస్‌యూ) 2024లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) నమూనాలో ఏర్పాటైన కొత్త సంస్థ. దీని లక్ష్యం స్వల్పకాలిక సిల్ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం. దీనికి ఇప్పటివరకు ఎన్బీఏ/ఎన్ఏఏసీ వంటి జాతీయ అక్రిడిటేషన్ లేదు. ప్రస్తుతం పాలిటెక్నిక్‌లు, ఎస్బీటీఈటీ అండ్ తెలంగాణ విద్యా చట్టం, 1982 (సెక్షన్ 6) కింద పనిచేస్తున్నాయి. ఈ చట్టం డిప్లొమా విద్యకు చట్టబద్ధమైన రక్షణ, గుర్తింపు, ప్రమాణాలు కల్పిస్తున్నది. పాలిటెక్నిక్‌లను ఈ చట్టం నుంచి తొలగించి వైఐఎస్‌యూలో విలీనం చేస్తే కింది పరిణామాలు ఎదురవుతాయి.
పెద్దపల్లి నర్సింహులు
9989548385