అచ్చినోళ్లు వాపస్ పోతలేరు
ఇగ ఇంత సల్లవడొద్దామని ఇంటిమొకాన బయల్దేరిన. కన్నారంల ఉన్న బ్యాంక్‌కాలనీ నుంచి కొత్తపల్లి మండలంలోని మా ఊరు సీతారాంపూర్‌కు నా తొవ్వ సాగుతున్నది. మా ఇంటికి వొయ్యే తొవ్వల్నే ఇంకో మంగలి దుకాణం ఉంటది. లోపల పీఓపీ జేసి టిప్టాపుగుంటది.
ఆ రోజు పొద్దన్నుంచి మొదలు, మజ్జాన్నం దాన్క కత్తెర వట్టింది లేదు, సవురం జేసింది లేదు. అసలు గిరాకే లేదురా అయ్యా అంటే.. కడుపుల గోకుడు షురువైంది. నేనటువోయినంక గిరాకీ గినా అస్తే నోట్లె మన్ను వడ్డట్టయితదని ఆకలికి ఓర్సుకోవట్టి గంట సేపాయె. అయినా ఎవ్వలొచ్చింది లేదు, సవురం జేయిమని అడిగింది లేదు. సూడంగ, సూడంగ ఒక పిలగాడొచ్చిండు. పది, పన్నెండేండ్లుంటయి గావొచ్చు. ‘అన్నా కటింగ్ జేస్తవానే’ అని బైటికెళ్లే అడిగిండు. ‘చేస్త దా తమ్మీ’ అన్న. సైకిల్ స్టాండేసి లోపల్కచ్చిండు. ఆ పిలగానికేం అనిపిచ్చిందో ఏమో.. ‘మల్లొస్తాగన్న’ అని మర్రిసూడకుంట వోయిండు. ఆ పిలగాడు వొయి అద్దగంటయితున్నది. ఇగరాలే, అగరాలే.
ఏ .. ఇగ ఇంత సల్లవడొద్దామని ఇంటిమొకాన బయల్దేరిన. కన్నారంల ఉన్న బ్యాంక్‌కాలనీ నుంచి కొత్తపల్లి మండలంలోని మా ఊరు సీతారాంపూర్‌కు నా తొవ్వ సాగుతున్నది. మా ఇంటికి వొయ్యే తొవ్వల్నే ఇంకో మంగలి దుకాణం ఉంటది. లోపల పీఓపీ జేసి టిప్టాపుగుంటది. పెద్ద పెద్ద కుర్సీలు, సుట్టూ అద్దాలు తళతళా మెరుస్తుంటయి. ఎందుకో నా కన్ను అటుమొకానవడ్డది. ఆ అద్దాలళ్ల నా దుకాన్లకొచ్చిన పిలగాడు తళతళా మెరుస్తున్న డు. పర్రెలువాసిన అద్దాలు, శినిగిన సీట్లతో ఉన్న నా దుకాణం ఒక్కసారి కండ్లళ్ల మెర్శింది. నా దుకాణం హాలత్ జూసే ఆ పిలగాడు ఎన్క కు మర్రచ్చిండని అప్పుడర్థమైంది. ఇగ ఆ రోజు మన్సున వట్టలే.
‘సూడుల్లా.. నువ్వట్లా బాధవడుకుంట ఉంటే నాకు మంచిగనిపిస్తలేదు, అన్నం బెడ్తున్న, ఇంత తినరాదు’ అని నా సుష్మ ఒక్కతీరుగ బతిలాడవట్టింది. నాకు ఉండబుద్దిగాక జరిగిన ముచ్చట ఆమెకు జెప్పిన. ‘మరేమనుకుంటున్నవ్? ఇయ్యాళ్ల, రేపు పెద్దపెద్దోళ్లే మొకం జూసి బొట్టు వెడ్తున్నరు. ఇగ గా పిలగాన్ని ఎవ్వలడిగిర్రు తియి?’ అని పళ్లెం ముందలవెట్టింది. ఆయాళ్ల అన్నం దినుకుంటా ఇద్దరాలుమగలం ముచ్చట వెట్టుకున్నం. అప్పుజేసైనా సరే దుకాణం మంచిగ జేయించాలనుకున్నం. ఒక మంగలి కుర్సీ పదిహేను వేల నుంచి ఇరువై వేల దాన్క ఉంటది. అసొంటియి రెండు కుర్సీలు, వాటి సుట్టూ అద్దాలు వెట్టి కొత్తగా జేయాల్నంటే ఎంతలేదన్న ఓ లచ్చ రూపాలు గావాలె. ‘ఔనే.. మీ అవ్వగారొళ్ల దిక్కు ఎవ్వలన్న మిత్తికిచ్చేటోళ్లున్నరానే..’ అని సుష్మనడిగిన. ‘ఇయ్యాల రేపు ఎవ్వలన్న పైసలు నమ్ముతున్నరానయ్యా, మీవోళ్లనే ఎవల్నన్న అడగరాదు? మళ్లా చిట్టీ ఎత్తిద్దాం’ అని బరువును నా దిక్కే తోసింది సుష్మ.
అన్నం దిన్నంక నాలుగింటిదాన్క ఇంట్లనే నడుమాల్సిన. సాయంత్రం దుకాన్లకచ్చినంక పైసల్ ఎవ్వల్నడుగుదామా అని ఫోన్ల ఉన్న కాంటాక్టు లిస్టు కిందికంటున్న. ఓ సోపతిగాడు గుర్తుకొచ్చిండు. ఎంబడే వానికి ఫోన్ గల్పిన. ‘అరేయ్ మావా.. ఓ లచ్చ రూపాలు అప్పు కింద కావాల్రా, మళ్లా ఐదారునెలల్ల ఇస్తా’ అనడిగిన. ‘అరేయ్ మావా.. నా దగ్గర లెవ్వుగని, వేరేటోళ్ల దగ్గర ఇప్పియిమంటే ఇప్పిస్తగని, మరి మిత్తి ఎక్కువరా’ అని జెప్పవట్టిండు. ‘ఏ అద్దురా.. అప్పుదెచ్చి ఈ పెద్దపోకిళ్ల తనానికి వోతే, మనం అడ్డీకి సాలమని’ ఫోన్ కట్జేసిన.
రెండు మూడ్రోజులాయె వాట్సాప్‌ల ఓ వార్త చక్కర్లు గొడ్తున్నది గని, నేను పెద్దగ వట్టిచ్చుకోలె. అసలు ఏంటిదా వార్త అని అప్పుడెందుకో ఫోన్ల ఓపెన్ జేసి సదివిన. రాష్ట్ర ప్రబు త్వం పూర్తి సబ్సిడీ మీద ‘బీసీలకు లక్ష రూపాల లోన్’ ఇస్తున్నదనేది ఆ వార్త సారాంశం. నాత్రి ఇంటికి వోయినంక ఆ ముచ్చట సుష్మతోని జెప్పిన. ‘అప్లయ్ అయితే జేసి జూద్దాం, మన అదృట్టం మంచిగుంటే అస్తద’ని బీరువాల ఉన్న కులం, ఆదాయం సర్టిఫికెట్లను ఎంకులాడివెట్టింది. తెల్లారితే బుదారం, జూన్ ఏడో తారీఖు. దుకాన్ల గిరాకీ లేదు. స్కాన్జేసి ఉన్న సర్టిఫికెట్లను ఫోన్ల ఓపెన్జేసి ఓపారి జూసిన. అదే ఫోన్ల సైట్ ఓపెన్ జేసి లచ్చ రూపాల లోన్ కోసం అప్లయి జేసిన.
2023, జూన్ 9, పొద్దున తొమ్మిదిన్నర గొడ్తున్నది. ‘హలో పవన్‌కు మారా..?’, ‘హల్లొ, మీరెవ్వలు? దుకాన్లనే ఉన్న.. గిరాకీ లేదు, జెప్పనరా, జెల్ది కటింగ్ జేసి పంపుతా’ ఎప్పుడొచ్చే గిరాకీ గినా గావచ్చునని మాట్లాడుతనే ఉన్నా.. ‘హలో.. హలో.. పవన్ నేను కొత్తపల్లి ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి సారును వయా’ అన్నడు అట్నుంచి ఫోన్లో మాట్లాడే వ్యక్తి. ‘సార్, సార్.. నమస్తే.’, ‘నువ్వు లచ్చ రూపాల బీసీ లోనుకు అప్లయి జేస్కున్నవ్ గదా? నీకు ప్రబుత్వం సాంక్షన్ జేసింది, ఇయ్యాళ్ల 11 గంటలకు శుభం గార్డెన్లకు రా, అచ్చి నీ చెక్కు నువ్వు తీస్కొని పో’ అని ఫోన్ కట్జేసిండు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవ సంబురాలు జరుగుతున్నయి. నాకొక్కనికే అనుకున్న. కనీ, నా అసొంటోళ్లు మస్తు మందే ఉన్నరని ఆడికి వోయినంక తెలిసింది. మంత్రి గంగుల కమలాకర్ సార్ వరుసగా చెక్కులిచ్చుడు షురూ జేసిండు. ‘గుంజపడుగు పవన్‌కుమార్, నాయీ బ్రాహ్మణ్’ అని ముందుగాళ్ల నా పేరే విల్శిర్రు. మంత్రి గంగుల సారు చెక్కు చేతులవెట్టినంక ‘కేసీఆర్ సార్ మీ కోసమే ఇంత మంచిపని షురూ జేసిండు. అతారలు గొనుక్కో, పైసల్ దుబార కర్సువెట్టకు’ అన్జె ప్పిండు. ‘సరే సార్’ రెండుజేతులా దండం పెట్టిన.కేసీఆర్ సర్కార్ ఇచ్చిన లచ్చ రూపాలతోని తెల్లారే నా దుకాన్ల పని షురూ జేసిన. రెండు కొత్త కుర్సీలేపిచ్చిన. వాటికె దురుంగ, ఎన్కకు కొత్త కొత్త అద్దాలు వెట్టిచ్చిన. ఇప్పుడు దుకాన్లకచ్చినోళ్లు మళ్లా వాపస్ పోతలేరు.

గడ్డం సతీష్
99590 59041
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

