Telangana | హాల్ ఆఫ్ షేమ్!
సాధారణ స్థాయి నాయకులు, సాధారణమైన ధోరణులతో ఉండేవారు పార్టీలు మారటం ఆ స్థాయికి, ధోరణికి అనుగుణంగా జరిగేది. వారికి రాజకీయాల్లోకి రావటం నుంచి మొదలుకొని జీవించినంతకాలం అదొక వ్యాపారం మాత్రమే.
తెలంగాణలో ఎప్పటికైనా హాల్ ఆఫ్ ఫేమ్, హాల్ ఆఫ్ షేమ్ పేరిట రెండు హాళ్లు నిర్మించినట్టయితే ఎందులో ఎవరి చిత్రపటాలను ఉంచాలి? నాకు తోచినంత వరకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో కాళోజీ, జయశంకర్, విద్యాసాగర్ రావు వంటి వారు ఉండాలి. హాల్ ఆఫ్ షేమ్లో కె.కేశవరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి వంటి వారుండాలి. పార్టీలలోకి అనేకులు వస్తుంటారు, పోతుంటారు. అది ఇప్పుడు ఒక విశేషం కానే కాదు. కనుక వారి గురించి ప్రత్యేకంగా వ్యాఖ్యానించాల్సిందేమీ లేదు.
కానీ, కొందరు వ్యక్తులు తమ దశాబ్దాల ప్రజా జీవితంలో, రాజకీయాలకు మించిన వ్యక్తిగత గౌరవాన్ని, విశ్వాసాన్ని సంపాదించుకుంటారు. ఇతరులు పార్టీలు మారినప్పుడు ఒక్క మాటతో తీసివేసే ప్రజలు, వీరి విషయంలో అట్లా చేయలేరు. ఇది వర్తమానం. భవిష్యత్తుకు సంబంధించి వీరి నైతిక వారసత్వం ఏ విధంగా మిగులుతుంది? చరిత్ర వారిపై ఏ తీర్పు చెప్పి ఏ విధంగా గుర్తుంచుకుంటుంది? చరిత్ర ఎప్పుడూ కర్కశమైనది. అది వారిని చిత్రపటాలుగా మార్చి హాల్ ఆఫ్ షేమ్లో వేలాడదీస్తుంది.
సీనియర్లు అయినా, దశాబ్దాల జీవితంలో ఇతరుల కన్న భిన్నంగా గౌరవపాత్రులైనా, వారికి సైతం ఒక నిజ జీవితం, కోరికలు, సంతానం భవిష్యత్తు పట్ల ప్రీతి ఉంటాయన్నది నిజం. అట్లా ఉండకూడదనటానికి వారు సర్వ సంగపరిత్యాగులేమీ కారు. అంతవరకు సరే. కాని అదే సమయంలో, ఇతరుల కంటే భిన్నంగా వీరొక ప్రతిష్ట కూడా సంపాదించుకున్నారు. ఆ క్రమంలో అనేకం అనుభవించారు కూడా. అటువంటప్పుడు తమ కోసం, తమ సంతానం కోసం అవసరమనుకున్నవి చేస్తూనే కొంత నైతికత, విలువలు అనేవి కూడా పాటించాలి. కానప్పుడు తమ ఇంతకాలపు ప్రతిష్టకు మిగిలే అర్థం, విలువ ఏమిటి?
Telangana | సాధారణ స్థాయి నాయకులు, సాధారణమైన ధోరణులతో ఉండేవారు పార్టీలు మారటం ఆ స్థాయికి, ధోరణికి అనుగుణంగా జరిగేది. వారికి రాజకీయాల్లోకి రావటం నుంచి మొదలుకొని జీవించినంతకాలం అదొక వ్యాపారం మాత్రమే. అధికార వ్యాపారం, ధన వ్యాపారం. వారెవరో, ఇవాళ ఎక్కడ ఉంటున్నారో, రేపు ఎటు పోతున్నారో, ఏమి చెప్పి ఆ పని చేస్తున్నారో ఎవరికీ గుర్తు కూడా ఉండదు. అటువంటివారికి కనీసం హాల్ ఆఫ్ షేమ్లో చేరే అర్హత అయినా ఉండదు. కొందరు అట్లా కాదు. వారు మొదటి నుంచి బాగానే ఉంటారు. జీవిత చరమాంకంలో అకస్మాత్తుగా, హాల్ ఆఫ్ షేమ్కు అర్హత సంపాదించుకుంటారు. అటువంటివారి గురించి మాత్రం తదనంతర తరాలు చరిత్రలోని పతన వ్యక్తిత్వాలుగా రేఖామాత్రంగానైనా తెలుసుకోవాలి. అది, చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవడానికి అవసరం. అందుకే ఇక్కడ రాయటం.
బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ. కేసీఆర్ అనే వ్యక్తి దాని నాయకుడు. పదేండ్ల పాటు కొన్ని విధానాల ప్రకారం ఆయన పరిపాలించారు. విధానాలలో మంచిచెడులు రెండూ ఉండవచ్చు. పరిపాలనలో తప్పొప్పులు రెండూ ఉండవచ్చు. వ్యక్తిగతంగా నాయకత్వపు తీరులోనూ బాగున్నవి, లేనివి రెండూ ఉండవచ్చు. వీటన్నింటిని కలిపినది ఒక స్థితి. మొత్తం వీటన్నింటిపై చూసినప్పుడు ప్రజల్లో కొన్నింటి గురించి ప్రశంసలు, కొన్నింటి గురించి విమర్శలు ఉన్నాయి. ఉద్యమకాలంలో 2014 వరకు ఒక విధంగా అయితే, ఆ తర్వాత రాజకీయ నాయకుడు కావటంతో పాటు పాలకుడు కూడా గనుక మరొక విధంగా.
ప్రజల దృష్టి నుంచి గల పరిస్థితి. ఇది గాక ఉద్యమకారులు, మేధావులు, మీడియా అన్నది రెండవ స్థితి. ప్రతిపక్షాలన్నది మూడవ స్థితి. స్వయంగా అధికార పక్షమైన బీఆర్ఎస్కు చెందినవారిది నాలుగవ స్థితి. ఇందులో మొదటి మూడింటి గురించిన చర్చ ఇక్కడ అవసరం లేనిది. హాల్ ఆఫ్ ఫేమ్, హాల్ ఆఫ్ షేమ్ ప్రస్తావనలు నాలుగవ సందర్భానికి సంబంధించినవి గనుక అందుకు పరిమితమవుదాం.
పై ముగ్గురు బీఆర్ఎస్ నాయకులు పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నంతకాలం ఏమి జరిగిందన్నది ఒక విషయం. పార్టీ నుంచి వెళ్లిపోయింది ఏ దశలో, ఏ కారణాలు చెప్పి అనేది రెండవ విషయం. పార్టీలో, పదవులలో కొనసాగుతున్నప్పటికీ వారికి పైన పేర్కొన్న వేర్వేరు అంశాలపై నాయకత్వం కన్నా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. అందులో ఆక్షేపించవలసింది గాని, అప్రజాస్వామికం గాని ఏమీ లేదు. ఒక పరిమితికి మించితే తప్ప పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమైనది కూడా ఏమీ ఉండదు. ఈ ముగ్గురి విషయంలో ఏమి జరిగింది? అట్లా భిన్నాభిప్రాయాలు ఏవైనా ఉండేవా? ఎంత జాగ్రత్తగా గుర్తు చేసుకున్నా అటువంటివేమీ కనిపించవు. కనీసం పార్టీతో, నాయకత్వంతో సంబంధాలు తెంచుకోవలసిన స్థాయివి. పైగా ముగ్గురికి ముగ్గురూ నాయకత్వాన్ని, ప్రభుత్వ పాలనను వేనోళ్ల పొగిడినవారే.
పూర్తిగా చివరి దశ వరకు. అంతదాకా ఎన్నెన్నో పదవులు, గౌరవాలు పొందినవారే. సరే. ఈ మాటలు అందరూ అంటున్నవే. కొత్త లేదు. కాని వారికి అటువంటి విమర్శలు ఏమైనా ఉంటే, పార్టీలో ఉండినప్పుడు సాహసించ లేదనుకుంటే, కనీసం బయటికి వచ్చిన తర్వాతనైనా ప్రజలకు తెలియజెప్పాలి కదా. శ్రీనివాసరెడ్డి అంటే మొన్నమొన్న బయటకు వచ్చారు. తక్కిన ఇద్దరికి కొన్ని నెలలైంది కదా. అంతకన్న విశేషమేమంటే వారు ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని బయటికి వచ్చి కూడా కొద్ది సందర్భాలలో మెచ్చుకున్నట్టు ఉన్నా రు. అది మొహమాటానికా? కాని పార్టీలోంచి బయటకు రావటాన్ని, అది కూడా అంత అకస్మాత్తుగా, అందులోనూ పార్టీ ఎన్నికలలో ఓడినప్పుడు జరగటాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి కొత్తగా అనుకోవలసిందేమీ లేదు. పైగా తాము కొత్తగా ఏమీ చెప్పనప్పుడు. కాని తమను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తమ చర్యను ఏమని ఆమోదించాలి?
సీనియర్లు అయినా, దశాబ్దాల జీవితంలో ఇతరుల కన్న భిన్నంగా గౌరవపాత్రులైనా, వారికి సైతం ఒక నిజ జీవితం, కోరికలు, సంతానం భవిష్యత్తు పట్ల ప్రీతి ఉంటాయన్నది నిజం. అట్లా ఉండకూడదనటానికి వారు సర్వ సంగపరిత్యాగులేమీ కారు. అంతవరకు సరే. కాని అదే సమయంలో, ఇతరుల కంటే భిన్నంగా వీరొక ప్రతిష్ట కూడా సంపాదించుకున్నారు. ఆ క్రమంలో అనేకం అనుభవించారు కూడా. అటువంటప్పుడు తమ కోసం, తమ సంతానం కోసం అవసరమనుకున్నవి చేస్తూనే కొంత నైతికత, విలువలు అనేవి కూడా పాటించాలి. కానప్పుడు తమ ఇంతకాలపు ప్రతిష్టకు మిగిలే అర్థం, విలువ ఏమిటి?
ఈ చర్చ వచ్చినప్పుడే ఆ ముగ్గురు ఆ పని సరిగ్గా ఎటువంటి దశలో చేశారు, ఏమి చెప్తూ చేశారనే ప్రశ్నలు వస్తాయి. ఇవి రెండూ తెలంగాణ అంతా చూసినవే గనుక ఇప్పుడు మళ్లీ చెప్పుకోనక్కరలేదు. అయితే ఈ దశలో మౌలికమైన విషయాలు కొన్ని ముందుకు వస్తాయి. తెలంగాణకు మొత్తం దేశంలోని ఉద్యమ భూములలో ఒకటిగా పేరున్నది. దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా. ఎందరెందరో తమ పోరాట వారసత్వాలను, స్ఫూర్తులను చరిత్రలో నమోదు చేసుకొని, తర్వాతి తరాలకు మిగిల్చిపోయారు. ఇటీవలి దశాబ్దాల కాలానికి వస్తే, ఆ పోరాటా లన్నవి స్వాతంత్య్రానంతర ఆధునిక ప్రజాస్వా మ్య దశలో ఉద్యమాలుగా రూపాంతరం చెందా యి. వివిధ ప్రాంతాలు, వర్గాల రాజ్యాంగ హక్కు లు, ఇతర హక్కుల ఉద్యమాలుగా.
తెలంగాణ అటువంటి ఉద్యమమే ఒకటి మహత్తరమైన రీతిలో సాగించి విజయం సాధించింది. ఆ ఉద్యమం, ఆ విజయం, అందులో పాల్గొన్న వ్యక్తులు తదనంతర తరాలకు ఒక గొప్ప చరిత్రను, స్ఫూర్తిని, విలువలను, నైతికతలను మిగిల్చారు. భారతదేశ స్వాతంత్య్రోద్యమం గురించి కూడా మనం ఈ విధంగానే మాట్లాడుకుంటాం. ఆ స్థాయితో మనను పోల్చుకోవడం కాదు గాని, రెండిటి మధ్య సామ్యాలు చెప్పుకోవటం వరకు సరైనదే.
ఆ విధంగా చూసినప్పుడు, ఈ ముగ్గురి వంటి నాయకులు తమ తర్వాతి తరాలకు, భవిష్యత్తుకు, తెలంగాణ చరిత్రకు మిగిలించవలసింది ఏమిటి? తమ సుదీర్ఘ రాజకీయ భాగస్వామ్యాన్ని, ప్రజా జీవితాన్ని, ఉద్యమ చరిత్రను తెలంగాణ ఏ విధంగా గుర్తుంచుకోవాలి? తాము ఎటువంటి సందేశాన్ని వారసత్వంగా తమ జీవిత చరమాంకంలో ప్రజలకు ఇవ్వాలి? ఏ స్థానం సంపాదించుకోవాలి? చివరికి ఒక ఘడియ ప్రాయమైన మోహావేశంతో, అకస్మాత్తు అనిపించేటట్టు చేసిందేమిటి? హాల్ ఆఫ్ షేమ్లో చోటు సంపాదించుకోవటం!
-టంకశాల అశోక్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

