కక్షసాధింపులో ‘బతుకమ్మ’ బలి!
బతుకమ్మ..అంటే కేవలం తొమ్మిది రోజుల పూల పండుగ కాదు; కోట్లాది తెలంగాణ ప్రజల గుండెల చప్పుడు. ఆడబిడ్డల సొంత పండుగకు చీరలు కూడా ఇవ్వకుండా, స్వరాష్ట్రంలో వారి ఆత్మగౌరవాన్ని అవమానిస్తున్నది ఈ కక్షసాధింపుల కాంగ్రెస్ ప్రభుత్వం!
తెలంగాణ ఉద్యమంలో అస్తిత్వ పతాకగా నిలిచిన బతుకమ్మపై ఉద్యమ ద్వేషులైన కాంగ్రెస్ పాలకులు వారి సహజ రీతిలోనే వివక్ష చూపిస్తున్నారు. ఈ పండుగకు సిరిసిల్ల నేతన్నలకు కనీసం చీరల ఆర్డర్లు కూడా సరిగా ఇవ్వకపోవడంతో కార్మిక కుటుంబాలు ఆకలికేకలతో అల్లాడుతున్నాయి. కనిపించిన దేవుళ్ల పేర్లన్నీ వాడుకొని రాజకీయం చేసే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, తెలంగాణ ఆడబిడ్డల ఘనమైన పండుగ బతుకమ్మకు సరైన ఏర్పాట్లు చేయడం చేతకావడం లేదా? లేదం టే, బతుకమ్మ ఆటపాటల్లో కూడా వినాయకచవితి పండుగలాగే ఊరూరా కేసీఆర్ గానమే వినిపిస్తుందనే భయమా? అని ప్రజల్లో చర్చ జరుగుతున్నది.
స్వరాష్ట్ర కల సాకారమైన ఆత్మగౌరవ ప్రతీక. పరాయి పాలకుల గడ్డపై, ఆంధ్రా వలస పాలనలో అణచివేతకు గురైనా మన అస్తిత్వాన్ని చాటుకోవడానికి, ఉద్యమకాలంలో ఇదే బతుకమ్మ తెలంగాణ అస్తిత్వ పతాకమై నిలిచింది. ఆనాడు ఉద్యమంలో వీధివీధినా పూల సింగిడిలై కదిలిన ఆడబిడ్డలు, స్వయంపాలన కాంక్షను ఈ పండుగ ద్వారానే చాటారు. కేసీఆర్ నాయకత్వంలోని గులాబీ సైన్యం ఈ పండుగకు బ్రాండ్ అంబాసిడర్గా ముందుండి నిలిచింది. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ విశిష్టతను గల్లీ నుంచి ఢిల్లీ దాటించి లండన్, అమెరికా మీదుగా దుబాయ్ బుర్జు ఖలీఫా స్క్రీన్ల వరకు చేర్చి, అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మకు ఒక సగర్వమైన గుర్తింపును తెచ్చింది బీఆర్ఎస్ శ్రేణులే.
స్వరాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగి, కాంగ్రెస్ పాలకులు గద్దెనెక్కిన తర్వాత నుంచి కనిపిస్తున్న దృశ్యాలు ప్రతీ తెలంగాణవాసి గుండెను రగిలిస్తున్నాయి. అధికార పార్టీకి తెలంగాణ సంస్కృతి అన్నా, ఇక్కడి సంప్రదాయాలన్నా ఎంతటి చులకన భావమున్నదో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వైఖరి చూస్తే స్పష్టమవుతున్నది. బతుకమ్మ పండుగను తాము ఎంత ఘనంగా నిర్వహించినా, అది తెలంగాణ వాదానికి, బీఆర్ఎస్కు, కేసీఆర్కు లబ్ధి చేకూరుస్తుందనే అక్కసుతో, తీవ్రమైన రాజకీయ ద్వేషంతోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కోటి మందికిపైగా ఆడబిడ్డల ఇంటికి ‘బతుకమ్మ కానుక’గా రేషన్ షాపుల ద్వారా వారం రోజుల ముందే చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టి, పూర్తి చేసేవారు. వందలాది రంగులు, అద్భుతమైన డిజైన్లతో ఒక కుటుంబంలో అన్నగా, తమ్ముడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పంపే ఆ చీరల కోసం మహిళలు ఎంతగానో ఎదురుచూసేవారు.
కానీ నేడు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకమ్మ కానుకలపై కక్షసాధింపు చర్యలు మొదలయ్యాయి. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని బజారుకీడుస్తూ, చీరల పంపిణీని నిలిపివేసి, బతుకమ్మపై తమకున్న వివక్షను బట్టబయలు చేసుకున్నారు. నాడు బతుకమ్మ చీరల ఆర్డర్ల వల్ల సిరిసిల్ల పవర్లూమ్ రంగానికి, పోచంపల్లి చేనేత కార్మికులకు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్తో నిరంతరాయంగా ఉపాధి లభించేది. ఆ మగ్గాల చప్పుడు నేతన్నల ఇండ్లల్లో సంక్రాంతి సంబురాన్ని నింపేది. కానీ నేడు కాంగ్రెస్ సర్కార్ నేతన్నలకు పాత బకాయిలు చెల్లించకుండా, కొత్త ఆర్డర్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నది. సిరిసిల్ల నేతన్నలను బతుకమ్మ చీరల నెపంతో రోడ్డున పడేసి, సూరత్ కంపెనీలకు మేలు చేసేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడం వెనుక ఉన్న కుట్రలేమిటో ప్రజలంతా గమనిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించి, సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా కోట్ల రూపాయల నిధులను నేరుగా జిల్లాలకు, గ్రామ పంచాయతీలకు కేటాయించేవారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన చెరువులు, రాష్ట్రంలోనే వేలాది నిమజ్జన ప్రాంతాలన్నీ విద్యుత్తు వెలుగులతో, అద్భుతమైన మౌలిక వసతులతో, క్యూలైన్లతో వైభవంగా వెలిగిపోయేవి.
బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించి, సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా కోట్ల రూపాయల నిధులను నేరుగా జిల్లాలకు, గ్రామ పంచాయతీలకు కేటాయించేవారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన చెరువులు, రాష్ట్రంలోనే వేలాది నిమజ్జన ప్రాంతాలన్నీ విద్యుత్తు వెలుగులతో, అద్భుతమైన మౌలిక వసతులతో, క్యూలైన్లతో వైభవంగా వెలిగిపోయేవి. కానీ నేడు ఆ చెరువుల్లో కనీసం గుర్రపుడెక్కను తీయడానికి, వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి కూడా స్థానిక సంస్థల వద్ద నిధులు లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అనవసరమైన పనులకు వేల కోట్లాది రూపాయలను కేటాయిస్తున్న కాంగ్రెస్ సర్కార్, బతుకమ్మ పండుగ నిర్వహణకు బడ్జెట్ విడుదల చేయకుండా చేతులెత్తేసి, తెలంగాణ పరువు తీసింది.
ఢిల్లీ పాలకుల కనుసన్నల్లో నడిచే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ మట్టి వాసన, ఇక్కడి అస్తిత్వ పండుగల విలువ తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ, కేసీఆర్పై ఉన్న రాజకీయ కక్షను తెలంగాణ పౌరుల ఆత్మగౌరవమైన బతుకమ్మ పండుగపై చూపించడం అత్యంత దుర్మా ర్గం. ఈ వివక్షను తెలంగాణ సమాజం అంతా గమనిస్తున్నది. మన సంస్కృతిని గౌరవించని రాష్ట్ర పాలకులకు, మన పండుగలను అవమానించే ఈ శక్తులకు ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఆడబిడ్డ, ప్రతి నేతన్న రాబోయే రోజుల్లో తమ ఓ టుహక్కు రూపంలో బుద్ధి చెప్పడం ఖాయం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
గోపాల బాలరాజు
73370 82570
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

