Health Tips : ఆమ్చూర్గా పిలిచే మామిడి కాయ పొడిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆమ్చూర్లో ఉండే ఔషధ గుణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు రక్తపోటు, మధుమేహం నియంత్రణలో చక్కగా పనిచేస్తాయి.
చట్నీలు, కూరలు, సూప్స్ సహా మన వంటకాల్లో వాడే ప్రతి 20 గ్రాముల ఆమ్చూర్లో విటమిన్ ఈ, విటమిన్ ఏ, విటమిన్ సీ, క్యాల్షియం, డైటరీ ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి పలు పోషక విలువలున్నాయి. ఇందులో కొవ్వులు, సోడియం లేకపోవడంతో హృద్రోగులు దీన్ని తప్పక తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఆమ్‌చూర్‌ను తరచూ తీసుకుంటే కంటి సమస్యలు బాధించవు. కాటరాక్ట్స్ వంటి వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో మలబద్ధకం సమస్య తొలగి జీర్ణప్రక్రియ సాఫీగా సాగుతుంది. ఆమ్చూర్లో ఉండే పాలీపెనాల్స్, కరోటెనాయిడ్లు జీవక్రియలను వేగవంతం చేయడం ద్వారా ఇది మధుమేహ రోగులకూ మెరుగైన ఆహారంగా చెబుతారు. తక్కువ కేలరీలు కలిగిన ఆమ్‌చూర్‌తో బరువు తగ్గుతారని కూడా పోషకాహార నిపుణులు చెబుతున్నారు.