లక్నో : యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ వృద్ధుడు స్ప్రౌట్స్ చాట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. యూట్యూబ్ స్వాద్ అఫిషియల్ పేరుతో ఇన్స్టాగ్రాం పేజ్‌లో అప్లోడ్ అయిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో పెద్దాయన పలురకాల స్ప్రౌట్స్‌ను విస్తరాకులో కలపి పచ్చిమిర్చి ఇతర స్పెసెస్ను మిక్స్ చేసి గ్రీన్ చట్నీతో కస్టమర్ల కోసం సిద్ధం చేస్తున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంది.
కెమెరా వైపు చూస్తూ నవ్వులు చిందిస్తూ ఆయన ఈ చాట్‌ను తయారు చేయడంతో ఆయన స్మైల్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. కాకా జీ కి బెస్ట్ చాట్ ఇన్ కాన్పూర్ అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. తాత చిరునవ్వే ఈ వీడియోకు హైలైట్ అని నెటిజన్లు చెబుతుండగా అమాయకంగా నవ్వుతున్న పెద్దాయనకు దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మరో యూజర్ కామెంట్ చేశాడు.