బాగ్దాద్: ఒక పెండ్లి వేడుకలో రెచ్చగొట్టేలా వధువు పాట పాడటంతోపాటు డ్యాన్స్ కూడా చేసింది. దీనిపై ఆగ్రహించిన వరుడు అక్కడికక్కడే విడాకులు ఇచ్చాడు. అంతా విస్తూపోయే ఈ ఘటన ఇరాక్‌లో జరిగింది. ఆ దేశ రాజధాని బాగ్దాద్‌లో ఇటీవల ఒక పెండ్లి వేడుక జరిగింది. ఈ సందర్భంగా సిరియా గాయకురాలు లామిస్ కాన్ సాంగ్ ‘మెసయతారా’ను వధువు తరుఫు వారు ప్లే చేశారు. ‘నేను ఆధిపత్యం చెలాయిస్తా.., నేను నిన్ను నియంత్రిస్తాను’ అనే రెచ్చగొట్టే విధంగా ఉన్న ఈ పాటకు వధువు డ్యాన్స్ కూడా చేసింది.
కాగా, రెచ్చగొట్టేలా ఉన్న ఈ పాటకు వధువు డ్యాన్స్ చేయడం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వరుడి కుటుంబం తెలిపింది. వరుడి కుటుంబం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ, వాగ్వాదానికి ఇది దారి తీసింది. చివరకు వరుడు పెండ్లి వేదికపైనే వివాహానికి ముగింపు పలికాడు. అక్కడికక్కడే నవ వధువుకు విడాకులు ఇచ్చాడు. మరోవైపు ఇరాక్‌లో అత్యంత వేగంగా విడాకులకు దారి తీసిన ఘటనగా ఇది రికార్డుకెక్కింది.