క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తూ కోటీశ్వరుడయ్యాడు!

న్యూయార్క్ : క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తూ అమెరికాకు చెందిన వైద్యుడు అనికీవ్ ఏకంగా రూ 2.17 కోట్లు పైగా క్యాష్ బ్యాక్ ద్వారా సంపాదించాడు. 2009లో క్రెడిట్ కార్డు చెల్లింపుల ద్వారా సంపాదించడాన్ని హాబీగా మొదలుపెట్టిన అనికీవ్ కు ఆ తర్వాత ఇది ప్రొఫెషన్ గా మారింది. ఆపై దీని ద్వారా అతడు మిలియన్లు సంపాదించాడు. పెద్ద సంఖ్యలో గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేసేందుకు అనికీవ్ తన క్రెడిట్ కార్డును ఉపయోగించేవాడు.
ఆపై వాటిని నగదుగా మార్చుకుని తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకుని క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించేవాడు. ఈ చెల్లింపులతో అతడికి క్రెడిట్ కార్డు కంపెనీ నుంచి రివార్డు అందేది. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల నుంచి వచ్చే రివార్డులు అతడికి ఆదాయ వనరుగా మారాయి. ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఈ ప్రక్రియను అనికీవ్ పలుమార్లు రిపీట్ చేసేవాడు. ఉదాహరణకు అనికీవ్ 500 డాలర్ల గిఫ్ట్ కార్డు కొనుగోలుపై 25 డాలర్ల రివార్డును పొందేవాడు. దీనిలో ఆరు డాలర్లు ఫీజు కింద పోగా 19 డాలర్లు మిగిలేవి.
ఏండ్ల తరబడి ఈ ట్రిక్ ప్రయోగించడం ద్వారా అతడు 3 లక్షల డాలర్లు (రూ 2.17 కోట్లు) పోగుచేశాడు. అనికీవ్ ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడం గుర్తించి కొందరు అమెరికన్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు సమాచారం అందించగా దర్యాప్తు చేపట్టిన అధికారులు వ్యవహారాన్ని న్యాయస్ధానం ముందుకు తీసుకువచ్చారు. అయితే క్యాష్ బ్యాక్ లు, రివార్డులు తన ఆదాయం కాదని ఇవి క్రెడిట్ కార్డు కంపెనీలు తనకు బహుకరించాయని ఆయన వాదించాడు. ఇవి ఆస్తులు కాదని తేల్చిచెప్పిన న్యాయస్థానం వీటిని నగదుగా మార్చుకుంటే మాత్రం పన్నులు చెల్లించాలని తేల్చిచెప్పింది. దీంతో అనికీవ్ నుంచి పన్నులు వసూలు చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- credit card
- high bills
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

