న్యూఢిల్లీ : వ్యాయామంలో కింగ్ వంటి సైక్లింగ్‌తో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. బాల్యంలో ప్రతిఒక్కరూ సైకిల్‌పైనే స్కూల్‌కు వెళ్లడం, ఫ్రెండ్ ఇంటికి వెళ్లడం వంటివి చేస్తుంటారు. ఏ వయసులోనైనా సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. సైక్లింగ్‌తో తీరైన శరీరాకృతి లభించడంతో పాటు దీర్ఘాయువూ సొంతమవుతుందని పరిశోధనలు వెల్లడించాయి.
రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని, గుండె కండరాలపై ఒత్తిడి తగ్గించి రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు ఉపకరిస్తుందని జర్నల్ సర్క్యులేషన్ వెల్లడించింది. నిరంతరం సైక్లింగ్ ద్వారా గుండె జబ్బుల ముప్పు 15 శాతం తగ్గుతుందని, స్ట్రోక్, గుండె పోటు ముప్పును నివారిస్తుందని తెలిపింది. సైక్లింగ్‌తో స్ధూలకాయం ముప్పు తగ్గడంతో దీర్ఘకాలంలో మధుమేహం రాకుండా నిరోధించవచ్చని పేర్కొంది.