e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News సిలికానాంధ్ర విశ్వ‌విద్యాల‌యానికి ప్ర‌తిష్ఠాత్మ‌క WASC గుర్తింపు

సిలికానాంధ్ర విశ్వ‌విద్యాల‌యానికి ప్ర‌తిష్ఠాత్మ‌క WASC గుర్తింపు

సిలికానాంధ్ర విశ్వ‌విద్యాల‌యానికి ప్ర‌తిష్ఠాత్మ‌క WASC గుర్తింపు

హైద‌రాబాద్ : భారతీయ భాషలు, కళలకు నెలవైన యూనివ‌ర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర‌కు ప్ర‌తిష్ఠాత్మ‌క వెస్ట్ర‌న్ అసోసియేష‌న్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్(WASC) గుర్తింపు ల‌భించింది. భారతీయులచే స్థాపించబడి ప్రవాస భారతీయుల చరిత్రలో తొలిసారి ఈ కీర్తి అందుకున్న విద్యాల‌యంగా సిలికానాంధ్ర విశ్వ‌విద్యాల‌యం నిలిచింది. గత శతాబ్ద కాలంలో అమెరికాలో భారతీయులచే ఇటువంటి విశ్వవిద్యాలయం నెలకొల్పబడటం దీనితోనే ప్రథమం. ఇటువంటి విశ్వవిద్యాలయానికి WASC గుర్తింపు కూడా లభించడం ప్రప్రథమం. కాలిఫోర్నియా రాష్ట్రంలో పేరొందిన స్టాన్ ఫోర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ, లాస్ ఏంజ్‌లిస్ విశ్వవిద్యాలయాలకు ఉన్న గుర్తింపే ప్ర‌స్తుతం సిలికానాంధ్ర విశ్వ‌విద్యాల‌యానికి ద‌క్కింది.

ఈ శుభ సందర్భాన్ని పుర‌స్క‌రించుకుని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ.. భారతీయ భాషలకు, కళలకు అంతర్జాతీయస్థాయిలో పట్టంగట్టి, ప్రతిభ గల విద్యార్థులకు బోధన చేయటానికి ఈ గుర్తింపు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఆచార్య పప్పు వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ.. ఈ గుర్తింపు విశ్వవిద్యాలయం మరిన్ని భారతీయ కళలు, భాషలు, ఆయా రంగాల్లో పరిశోధనలు చేయటానికి సహకరిస్తుందని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. విశ్వద్యాలయ ప్రొవోస్ట్, చీఫ్ అకడెమిక్ ఆఫీసర్ చమర్తిరాజు మాట్లాడుతూ.. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుందని చెప్పటానికి ఈ గుర్తింపే నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ఆర్థిక, పరిపాలనా విభాగం వైస్ ప్రెసిడెంట్ కొండుభట్ల దీనబాబు మాట్లాడుతూ.. WASC గుర్తింపు విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎన్నోబాటలు వేస్తుందని తెలుపుతూ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

- Advertisement -

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కాలిఫోర్నియా రాష్ట్రం, మిల్పిటాస్ నగరంలో 2016లో స్థాపించబడింది. 2017లో కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు సంపాదించి భారతీయ కళలు, భాషల్లో విద్యాబోధన ప్రారంభించింది. ప్రస్తుతం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో కూచిపూడి, భరత నాట్యం, కర్ణాటక సంగీతం, తెలుగు, సంస్కృత భాషా విభాగాలు ఉన్నాయి. డిప్లమో మొదలుకొని మాస్టర్స్ డిగ్రీల వరకు విద్యాబోధన జరుగుతున్నది. వ‌ర్సిటికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల‌నుకునేవారు https://www.universityofsiliconandhra.org/ వెబ్ సైట్‌కు లాగినై తెలుసుకోవ‌చ్చ‌ని ఫణి మాధవ్ కస్తూరి పేర్కొన్నారు.

సిలికానాంధ్ర విశ్వ‌విద్యాల‌యానికి ప్ర‌తిష్ఠాత్మ‌క WASC గుర్తింపు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సిలికానాంధ్ర విశ్వ‌విద్యాల‌యానికి ప్ర‌తిష్ఠాత్మ‌క WASC గుర్తింపు
సిలికానాంధ్ర విశ్వ‌విద్యాల‌యానికి ప్ర‌తిష్ఠాత్మ‌క WASC గుర్తింపు
సిలికానాంధ్ర విశ్వ‌విద్యాల‌యానికి ప్ర‌తిష్ఠాత్మ‌క WASC గుర్తింపు

ట్రెండింగ్‌

Advertisement