ఆస్ట్రేలియా : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధించిన సందర్భంగా ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. సీఎం కేసిఆర్, విజయం సాధించిన నోముల భగత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రజలు అభివృద్ధికి పట్టంకడుతూ.. టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ తో ఎన్నుకోవడం శుభ పరిణామన్నారు. రాబోయే పుర ఎన్నికల ఫలితాలలో కూడా కారు జోరు కొనసాగుతుందని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు.
నోముల ఝాన్సీ రవి అధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు రవి సాయల , రాకేష్ లక్కరసు, వీరేందర్ సాంబరాజు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్‌ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
రంజాన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల
సీనియర్ ఫొటోగ్రాఫర్ సలీం మృతి పట్ల మంత్రి వేముల సంతాపం