హైదరాబాద్ : తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపాడ్) ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్ (Dallas)మహానగరం ఆర్గైల్‌లోని పైలట్ నాల్ పార్క్ ఫ్లాష్‌మాబ్‌లో నిర్వహించిన వనభోజనం అహ్లాదంగా, ఉత్సాహంగా కొనసాగింది. షడ్రసోపేతమైన భోజనంతో పాటు సంగీత(Music),నృత్య(Dance), సాంస్కృతిక కార్యక్రమాలను(Cultural) విజయవంతంగా నిర్వహించారు. సుమారు 2500 మంది వరకు పాల్గొన్న కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నంత సంతోషం కలిగించిందని సభ్యులు పేర్కొన్నారు.
తెలంగాణ వంటకాలైన హైదరాబాద్ దమ్ చికెన్‌బిర్యానీ(Dam Chicken Biryani), బగారారైస్(Bagara Rice), పచ్చిపులుసు, పికిల్స్ తదితర వంటకాల రుచులను ఆస్వాదించారు. ఫేస్ పెయింటింగ్, మెహందీ(Mehandi) వేసుకోవడానికి మహిళలు ఆసక్తిని కనబరిచారు. క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు.
వనభోజన కార్యక్రమాన్ని రఘవీర్ బండారు (చైర్ ఆఫ్ ఫౌండేషన్ కమిటీ), సుధాకర్ కలసాని (చైర్ ఆఫ్ బీవోటీ), లింగారెడ్డి ఆల్వ (ప్రెసిడెంట్), రోజా ఆడెపు (కోఆర్డినేటర్) మార్గదర్శకత్వంలో విజయవంతంగా నిర్వహించగా మధుమతి వైశ్యరాజు వీరికి సమన్వయం చేశారు. రావు కల్వల, అజయ్‌రెడ్డి, ఉపేందర్ తెలుగు, రవికాంతరెడ్డి మామిడి (మాజీ అధ్యక్షుడు) ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షించారు.
ఉమ గడ్డం నేతృత్వంలో మాధవి సుంకిరెడ్డి, ఇందు పంచరుపుల, లక్ష్మి పోరెడ్డి, రూప కన్నయ్యగారి, మంజుల తొడుపునూరి, రేణుక చనుమోలు, నరేష్ సుంకిరెడ్డి, అశోక్ కొండల, విజయ్ తొడుపునూరి, శ్రీధర్ వేముల, గోలి బుచ్చిరెడ్డి వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడియో, వీడియో, సోషల్‌మీడియా వ్యవహారాల ఇన్చార్జిగా అనురాధ మేకల (టీపాడ్ వైస్ ప్రెసిడెంట్) వ్యవహరించారు.
మాధవి లోకిరెడ్డి సాంస్కృతిక కార్యక్రమాలను సమన్వయం చేయగా స్వప్న తుమ్మకాల, గాయత్రి గిరి, హరిశంకర్ రేసు, శివ కుడిత్యాల, బాల గనపవరపు బహుమతులు, పూజలు ఇతర బాధ్యతలను నిర్వర్తించారని నిర్హాకులు పేర్కొన్నారు. ఇంకా కరన పోరెడ్డి, రత్న ఉప్పల, శ్రీనివాస్ అన్నమనేని, సురేందర్ చింతల, ఆదిత్య గాదె సేవలను పలువురి ప్రశంసలు అందజేశారు.
Nri Vanabojanalu