Ugadi | హైదరాబాద్ : ఉగాది పండగను ఆదివారం జర్మనిలోని బెర్లిన్ నగరంలో ఘనంగా నిర్వహించారు. జర్మని తెలంగాణ అసోసియేషన్ వ్వవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చలిగంటి ఆధ్వర్యంలో బెర్లిన్‌లోని గణేష్ ఆలయంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఈ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ తాము సాంప్రదాయంగా ఉగాది పంచాంగం, ఉగాది పచ్చడితో పాటు రుచికరమైన తెలంగాణ ఆహార పదార్థాలను వండుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో జర్మని తెలంగాణ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వెంకటరమణ బోయిన్పల్లి, కార్యదర్శి అలేఖ్య బోగా, సాంస్కృతిక కార్యదర్శి శరత్‌రెడ్డి, యోగానంద్, శ్రీనాథ్, నటీష్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.