TPAD.. తెలంగాణ పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్.. సేవాకార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది. డల్లాస్ దాని చుట్టుపక్క ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కలిపించడంతో పాటు ఆకలి తీర్చి పుణ్యం కట్టుకుంటోంది. ఈ సంస్థ ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేపట్టడం వెనుక ఎంతో మంది తెలంగాణ ఎన్ఆర్ఐల కృషి, చిత్తశుద్ది ఉన్నాయి. ఇటీవల డల్లాస్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా 150 మంది ప్రాణాలను రక్షించారు. తాజాగా నిరాశ్రయులైన సుమారు 450మందికి ఆశ్రయం కల్పించడంతోపాటు వారి ఆకలి తీర్చే ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని TPAD చేపట్టింది. దీనికోసం ఆస్టిన్ స్ట్రీట్ హోమ్‌లెస్ షెల్టర్‌ను ఎంపిక చేసి కోఆర్డినేటర్ దీపికారెడ్డి ఆధ్వర్యంలో రోజంతా ఫుడ్ డ్రైవ్ కర్యాక్రమాన్ని కొనసాగించారు.
దీఒక రోజంతా సాగిన ఈ Food Drive కార్యక్రమంలో, TPAD బృందం Food Drive Coordinator అయిన Deepika Reddy ఇంట్లోనే పాస్తా, చికెన్ మరియు మాష్డ్ పొటాటో వంట చేయడం జరిగింది. ఆహారం తయారయ్యాక, TPAD బృందం Austin Street Shelterకు వేడివేడిగా ఆహారం తీసుకెళ్లి, స్వయంగా వడ్డించారు. వారు పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటోతో పాటు పండ్లు మరియు డెజర్ట్ కూడా వడ్డించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి TPADకు చెందిన Rao Kalvala (FC Chair), Pandu Palway (BOT Chair), Anuradha Mekala (President), Ramana Lashkar (Coordinator)లు చేయి చేయి కలిపి సహకరించారు. 50 మంది వాలంటీర్లు వంట చేయడం, చేసిన వంటకాలను వడ్డించడంలో పాల్గొన్నారు. సమాజానికి ఉపయోగపడేకార్యక్రమాలలో పాల్గొనడం తమ సామాజిక బాధ్యతగా TPAD భావిస్తున్నదని, భవిష్యత్తులో కూడా అటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఫుడ్ డ్రైవ్ కో ఆర్డినేటర్ దీపికా రెడ్డి అన్నారు. TPAD సీనియర్ నాయకుడు మరియు FC Vice Chair అయిన Raghuveer Bandaru ఈFood Drive కు మార్గదర్శనం చేసి, గ్రాసరీ కొనుగోలు నుండి ప్రారంభించి మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా Rao Kalvala (FC Chair), Pandu Palway (BOT Chair), Anuradha Mekala (President), Ramana Lashkar (Coordinator), మరియు Food Drive Coordinator Deepika Reddy మాట్లాడుతూ, ఈ Food Drive లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, TPADకి చెందిన 50 మంది వాలంటీర్లు వంట చేయడం మరియు వడ్డించడంలో పాల్గొన్నారని చెప్పారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలలో పాల్గొనడం తమ సామాజిక బాధ్యతగా TPAD భావిస్తున్నదని, భవిష్యత్తులో కూడా అటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. TPAD సీనియర్ నాయకుడు మరియు FC Vice Chair అయిన Raghuveer Bandaru ఈ Food Drive కు మార్గదర్శనం చేసి, గ్రాసరీ కొనుగోలు నుంచి ప్రారంభించి మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.