Sankranthi | తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు
Sankranthi | తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టోరంటో బ్రాంటెన్లోని చింగ్కూజీ సెకండరీ స్కూల్లో ఈ వేడుకలను నిర్వహించారు. సంక్రాంతి వేడుకల్లో 800 మందికి పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు.
Sankranthi | తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టోరంటో బ్రాంటెన్లోని చింగ్కూజీ సెకండరీ స్కూల్లో ఈ వేడుకలను నిర్వహించారు. సంక్రాంతి వేడుకల్లో 800 మందికి పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ వేడుకలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి ప్రారంభించగా, మేఘన గుర్రాల, శైలజ ఎర్ర, స్ఫూర్తి కొప్పు, ప్రహళిక మ్యాకల, శ్రీరంజని కందూరి జ్యోతి ప్రజ్వలన చేశారు. శ్రీరామదాసు అర్గుల గణేష వందనంతో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ, వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.

సంక్రాంతి సంబురాల్లో భాగంగా రాహుల్ బలనేని, జ్యోతి రాచ ఆధ్వర్యంలో 15 ఏండ్ల లోపు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్, షో అండ్ టెల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రవీణ్ నీల, ఝాన్సీలక్ష్మి గరిమెళ్ళ, గుప్తేశ్వరి వాసుపిల్లి, మనశ్విని వెలపాటి వ్యవహరించారు. అనంతరం వందమందికి పైగా చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వచనాలను అందించారు. అలాగే TCA స్పాన్సర్ డాక్టర్ సౌజన్య కాసుల, యేసు బాబుచే 2024 టోరెంటో తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు.
తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీరంజని కందూరి, ప్రహళిక మ్యాకల నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పోటీల్లో గెలిచిన వారందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం ద్వారా తెలంగాణ పండుగలని, సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి, ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శి శంతన్ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి ప్రహళిక మ్యాకల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు నాగేశ్వరరావు దలువాయి, ప్రణీత్ పాలడుగు, భగీరథ దాస్ అర్గుల, ప్రవీణ్ కుమార్ సామల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ చైర్మన్ నవీన్ ఆకుల, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, కలీముద్దీన్ మొహమ్మద్, ప్రకాష్ చిట్యాల, అఖిలేష్ బెజ్జంకి, హరి రావుల్, సంతోష్ గజవాడ, వేణుగోపాల్ రోకండ్ల, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురంతో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం కృతజ్ఞతా వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలను ఘనంగా ముగించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

