Sankara Nethralaya | అట్లాంటా: గ్రామీణ భారతదేశంలో నివారించదగిన అంధత్వ నిర్మూలన లక్ష్యంతో శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో అమెరికాలోనిఅట్లాంటాలో క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్ కార్యక్రమం ఘనంగా జరిగింది. జార్జియాలోని కమ్మింగ్ వెస్ట్ ఫోర్సిత్ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకలో MESU (మొబైల్ ఐ సర్జికల్ యూనిట్) “అడాప్ట్-ఎ-విలేజ్” నేత్ర శస్త్ర చికిత్స శిబిరాలకు మద్దతుగా $1.25 మిలియన్ (రూ. 10.4 కోట్లు) నిధులు సమీకరించారు.
సాంస్కృతిక విభాగాన్ని కల్చరల్ చైర్ నీలిమ గడ్డమణుగు సమన్వయం చేయగా, గాయకులు శాంతి మెడిచెర్ల, సందీప్ కౌతా, ఉషా మోచెర్ల, జనార్ధన్ పన్నెల, స్రవంతి కెటి, శిల్పా ఉప్పులూరి, శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల అలరించారు. నృత్య ప్రదర్శనలు గురువులు శ్రీదేవి రంజిత్ (మోహినీయాట్టం), సోబియా సుదీప్ కిషన్ (భరతనాట్యం), మిటల్ పటేల్ (కథక్), నీలిమ గడ్డమణుగు (కూచిపూడి) విద్యార్థులు అందించారు.
కార్యక్రమానికి భారత కాన్సుల్ జనరల్ రమేశ్ బాబు లక్ష్మణన్, శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ తడికమల్ల, కోశాధికారి మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనిరెడ్డి వంగిమల్ల, మెహర్ లంక, రాజ్ ఐల, రమేశ్ చాపరాల, డాక్టర్ కిషోర్ రెడ్డి రసమల్లు, గిరి కోటగిరి తదితరులు హాజరయ్యారు. బ్రాండ్ అంబాసిడర్ ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, సలహాదారులు SV ఆచార్య, నిర్మలా ఆచార్య, లీలా కృష్ణమూర్తి, నాట్ కృష్ణమూర్తి, డాక్టర్ కిశోర్ చివుకులను ప్రత్యేకంగా సన్మానించారు.
పూర్వాధ్యక్షురాలు లీలా కృష్ణమూర్తికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు. ప్రధాన దాతలుగా డాక్టర్ గోవింద విశ్వేశ్వర, కాష్ బూటాని, ప్రకాశ్ బేడపూడి, TR రెడ్డి, డాక్టర్ వీణా భట్, అరవింద్ కృష్ణస్వామి, జలంధర్ రెడ్డి, రఘు సుంకి, మురళీ రెడ్డి, కరుణాకర్ ఆసిరెడ్డి, భువనేశ్ భూ జల రెడ్డి, తిరుమల్ రెడ్డి కంభం, డాక్టర్ బీకే మోహన్, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, కిరణ్ రెడ్డి పాశం, వెంకట్ కణ్ణన్, డాక్టర్ లక్ష్మణ్ కల్వకుంట్ల, బుచ్చిరెడ్డి గోలి, శ్రీని ఎస్వీ, డా. మాధవ్ దుర్భ, వెంకట్ చుండి, ప్రసన్న కుమార్, ప్రభాకర్ రెడ్డి ఎరగం, జయంత్ నీలం, డాక్టర్ ప్రియ కొర్రపాటి, శ్రీనివాస్ మునుకుట్ల, జేసీ శేఖర్ రెడ్డి, రవి కందిమళ్ల, అనిల్ జాగర్లమూడి, డాక్టర్ ప్రసాద్ గరిమెళ్ల, వంశీ మాదాడి, భరత్ మాదాడి, స్వర్ణిమ్ కాంత్, కోదండ దేవరపల్లి, తిరు చిల్లపల్లి, జగదీశ్ చీమర్ల, శ్రీనివాస్ సూరపనేని, నారాయణ రేకపల్లి, డాక్టర్ మంజుల మంగిపూడి, ప్రతాప్ జక్కా, డా. నీతా సుక్తాంకర్, విష్ ఈమని, వర అకెళ్ళ, రజనీ పువ్వాడలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నిధులతో శంకర నేత్రాలయ MESU యూనిట్లు మారుమూల ప్రాంతాల్లో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసి, వేలాది మందికి చూపుని పునరుద్ధరించనున్నాయి. “మంచి హృదయాలు ఐక్యమైతే అద్భుతాలు జరుగుతాయి” అని CGI రమేశ్ బాబు, “ప్రతి స్పాన్సర్ ఒక గ్రామానికి ఆశాకిరణం” అని అధ్యక్షుడు బాలారెడ్డి పేర్కొన్నారు.