VAA | హైదరాబాద్ : ఆస్ట్రేలియా వెలమ అసోసియేషన్ (VAA) నూతన కార్యవర్గం ఏర్పాటైంది. వీఏఏ అద్యక్షుడిగా రంగారావు రంగినేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను వీఏఏ అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులందరికీ రంగారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండేండ్ల పాటు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ నూతన కార్యకర్గం 2027 వరకు కొనసాగనుంది.
నిన్నటి వరకు ప్రెసిడెంట్గా కొనసాగిన శ్రీనివాస్ రావు(టోనీ) తక్కళ్లపల్లి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. రాబోయే రెండేండ్ల పాటు మునుపటి లాగే కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.
2018లో ఆస్ట్రేలియా వెలమ అసోసియేషన్ ఏర్పాటైంది. నాటి నుంచి ఆస్ట్రేలియా గడ్డపై తెలంగాణ సంస్కృతిని తెలిపేలా కార్యక్రమాలు చేపడుతుంది. బతుకమ్మ, దసరా సంబురాలతో పాటు వన భోజనాలు కార్యక్రమాలను గత ఏడేండ్ల నుంచి నిర్వహిస్తూ వస్తుంది. ఇక వీఏఏ సభ్యులు విరాళాలు సేకరించి, నిరుపేదలకు, విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.
VAA