e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home ఎన్‌ఆర్‌ఐ ఏప్రిల్‌ నెలాఖరులో పీవీ విగ్రహ ప్రతిష్టాపన : మహేష్‌ బిగాల

ఏప్రిల్‌ నెలాఖరులో పీవీ విగ్రహ ప్రతిష్టాపన : మహేష్‌ బిగాల

అమెరికా : అమెరికాలోని అట్లాంటాలో దివంగ‌త మాజీ ప్రధాని పి.వి.న‌ర‌సింహారావు విగ్రహం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పీవీ ప్రతిష్టాపన సన్నాహక సమావేశానికి పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మ‌హేశ్ బిగాల హాజరయ్యారు.

అట్లాంటాలో రెండు, మూడు ప్రదేశాలలో స్థల ప‌రిశీల‌న జ‌రిగిన‌ట్లు ఆయన తెలిపారు. పీవీ విగ్రహాన్ని వచ్చే వారంలో అమెరికాకి పంపే ఏర్పాట్లు జరుగుతన్నాయని తెలిపారు. మొట్ట మొదటి విగ్రహం అట్లాంటాలో చేపడుతున్నందుకు అక్కడ అన్ని అన్ని సంఘాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేసారు. తెలంగాణా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.

- Advertisement -

అన్ని సంఘాలు ముందుకు వచ్చి పీవీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని ప్రతినిధులు ముక్త కంఠంతో చెప్పారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏఫ్రిల్‌ నెల ఆఖరులో విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని మహేష్ బిగాల తెలిపారు. త్వరలోనే వివరాలను తెలియజేస్తామన్నారు. ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ప్రముఖుల్ని, పీవీ కుటుంబ సభ్యుల‌ను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.

అమెరికాలోని తెలుగు, ఇండియన్ డయాస్పోరా కాకుండా సెనెటర్,మార్టిన్ లూథర్ కింగ్ కుటుంబ సభ్యులు, మిగ‌తా ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకి సభ్యులు నివాళులు అర్పించారు.

డా. పాడి శర్మ (IACA ఫౌండింగ్ మెంబర్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కిషన్ తాళ్లపల్లి గేట్స్ ప్రెసిడెంట్, వెంకట్ మీసాల తానా సే రీజియన్ కోఆర్డినేటర్, శ్రీధర్ కొంకల ఎన్నారై టీఆర్ఎస్ సభ్యుడు, నిరంజన్ పొద్దుటూరి ఎన్నారై టీఆర్‌ఎస్‌, జనార్దన్ పన్నెల గేట్స్ కార్యదర్శి, ఇన్నయ్య ఎనుముల తామా అధ్యక్షుడు, రవి కల్లి తామా ఉపాధ్యక్షుడు, సాయిరాం కరమంచి తామా కార్యదర్శి, శివకుమార్ రామడుగు ఎన్నారై ,గణేష్ కసమ్ గేట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, జయచంద్రారెడ్డి GATA బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, సందీప్ గుండ్ల గేట్స్ సాంస్కృతిక కార్యదర్శి , వెంకట్ గడ్డం TTA బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, శేఖర్ రెడ్డి పుట్టా TDF, అట్లాంటాకు చెందిన అజ్మీరీ ముస్తఫా, సాయిబాబా ఆర్కాట్ పాల్గొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement