Mahesh Bigala | దక్షిణాఫ్రికాలోనూ కేటీఆర్ సభకు ప్రణాళిక : మహేష్ బిగాలా
Mahesh Bigala | మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఇటీవల జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు విజయవంతంగా జరిగాయని గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలా అన్నారు.
మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఇటీవల జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు విజయవంతంగా జరిగాయని గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలా ( Mahesh Bigala ) అన్నారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై బీఆర్ఎస్ ఎన్ఆర్ఐలను ఎంతగానో ఉత్సాహపరిచారని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా ( South Africa ) శాఖ బీఆర్ఎస్ ఎన్నారై బృందం గురువారం మహేష్ బిగాలను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రవాస తెలంగాణ వాసుల సంక్షేమం, ఎన్నారై విభాగం భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
గత 8 సంవత్సరాలుగా నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికా శాఖ ఐక్యంగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోందని అభినందించారు. దక్షిణాఫ్రికాలో మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా అనేక సేవా, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
ఆఫ్రికా ఖండంలో, ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో కేటీఆర్ కార్యక్రమాన్ని అత్యంత విజయవం తంగా నిర్వహించేందుకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించాలని సలహా ఇచ్చారు. ఈ సమావేశంలో దక్షిణాఫ్రికా శాఖ సభ్యులు నరేందర్ మేడసాని, విష్ణు జైగుండా, శ్రీనివాస్ రేపాల పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anantha Nageswaran | 1991లాగే 2026 ఉండబోతున్నదా? కేంద్ర ఆర్థిక సలహాదారు ఏమన్నారంటే?
Elon Musk | భవిష్యత్తులో డబ్బు దాచుకోవడం వృథా.. ఎలాన్‌మస్క్ సంచలన వ్యాఖ్యలు
Viral News | కంటిలో విత్తనం మొలిచెనే.. సైబీరియాలో వింత ఘటన
KTR | అన్నిటికీ హాలిడేలు ప్రకటించిన ఈ 420 సర్కార్కే హాలిడే ఇస్తే దరిద్రం పోతది.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
IND vs NZ | నేడు న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. సిరీస్‌ను క్లీన్‌స్వీస్ చేయడమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

