మనవాళ్లు ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో ముందుంటారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మన మూలాలను మరిచిపోరు. సమయం దొరికినపుడల్లా మన సంస్కృతి గొప్పతనాన్ని చాటి చెప్తూనే ఉంటారు. ఈ కోవకు చెందిన వారే ఐశ్వర్య బాగ్యనగర్ . అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్నారు. బిజీ లైఫ్‌లో కూడా తనకు ఇష్టమైన చిత్రలేఖనాన్ని వదిలిపెట్టలేదు. ఖాళీ సమయంలో అద్భుతమైన చిత్రాలను గీస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రముఖులు, సినిమా హీరోలు మొదలు ఎన్నో అందమైన చిత్రాలను గీశారు. ఇదే కాదు భారతీయ కళ అయినటువంటి భరత నాట్యం కూడా నేర్చుకుంది.
ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ పోస్టర్‌తో పాటు భీమ్, రామరాజు చిత్రాలను తన కుంచెతో అద్భుతంగా చిత్రీకరించారు. అంతే కాదు దళపతి విజయ్, మహానటి కీర్తి సురేశ్ సహా మరెన్నో చిత్రాలు పెయింటింగ్ చేశారు. భారతీయ కళలపై ఉన్న ఆసక్తితో ఆమె 2016లో భరత నాట్యంలో కూడా అరంగేట్రం చేశారు.
ఐశ్వర్య బాగ్యనగర్( File Photo)