బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి : ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు
దేశ ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడానికి బీఆర్ఎస్ ఆవిర్భవించిందని బీఆర్ఎస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపల్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు.
హైదరాబాద్ : దేశ ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడానికి బీఆర్ఎస్ ఆవిర్భవించిందని బీఆర్ఎస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపల్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశం లో ఎక్కడా లేవని, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును తెలుసుకోవడానికి ప్రజలు తెలంగాణకు వస్తున్నారని పేర్కొన్నారు.
దేశం లో దివాలా తీసిన కాంగ్రెస్ రాష్ట్రంలోనూ చేవచచ్చిందని, కొత్త నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుతున్నారని వెల్లడించారు. 8ఏళ్ల బీఆర్ఎస్పాలన లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఎంత వివక్షత చూపుతుందని ఆరోపించారు . ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలిస్తున్న మోదీని ప్రశ్నించడం లో కాంగ్రెస్ విఫలమయ్యిందని విమర్శించారు.
ఈనె 5 న మహారాష్ట్ర లోని నాందేడ్ లో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ కు ప్రజలు లక్షలాది గా తరలి వచ్చి కేసీఆర్కు మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పర్యవేక్షణ లో అతి త్వరలో బీఆర్ఎస్ ఎన్నారై ఒమాన్ శాఖ లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలతో కోర్ కమిటీ ని ఏర్పాటు చేయనున్నట్లువెల్లడించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

