Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1 పూజా కార్యక్రమాలతో బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది.
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తున్న తొలి చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1 పూజా కార్యక్రమాలతో బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. సినీ ప్రముఖులు, అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్, ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వి.వి. వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేసి శుభాకాంక్షలు తెలపగా, నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. అలాగే హీరో ఆది సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్, సిద్ధు రెడ్డి, చీకోటి ప్రవీణ్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.
దర్శకులు రవికుమార్ చౌదరి, ఘటికాచలం వద్ద అసోసియేట్‌గా పనిచేసిన దివాకర్ యడ్ల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఓ అందమైన ప్రేమకథతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘డెలులు’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తుండగా, కన్నడ చిత్రం ‘కేజీయఫ్’లో యశ్ తల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్చనా జోయస్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే ‘అర్జున్ రెడ్డి’, ‘అమీతుమీ’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన అతిథి మైకల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు దివాకర్ యడ్ల మాట్లాడుతూ.. ప్రేమ అంటే రెండు మనసుల మధ్య పుట్టే అందమైన అనుభూతి అని, ఆ అనుభూతిని హృదయానికి హత్తుకునేలా తెరపై చూపించడమే మా ప్రయత్నమని తెలిపారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులందరికీ నచ్చేలా రూపొందిస్తున్న ఈ చిత్రానికి హైదరాబాద్, కేరళలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్లు చెప్పారు. నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ మాట్లాడుతూ.. మంచి కథ, నాణ్యమైన నిర్మాణ విలువలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకునే చిత్రాన్ని అందించడమే తమ లక్ష్యమని, కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు మరిన్ని సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
హీరో విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇది ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ అని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. హీరోయిన్ అర్చనా జోయస్ మాట్లాడుతూ తెలుగులో స్ట్రెయిట్ చిత్రంలో హీరోయిన్గా నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నటుడు అతిథి మైకల్ మాట్లాడుతూ మంచి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. కె.కె. రావు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సుధా శ్రీనివాస్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనివాస్ కె. నాయుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఆర్.వి. రామకృష్ణ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జీకే మీడియా పీఆర్వోగా సేవలందిస్తుంది.

Kishore Movie Makers
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
Dharman | అఫిషీయల్.. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల!
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

