హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుర్మాచలంకు తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ.. మలి దశ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఖండాంతరాలలో తెలంగాణ వాదాన్ని అనిల్ ఎంతో బలంగా వినిపించారన్నారు. అతడికి దక్కిన ఈ గౌరవం ప్రతి ప్రవాసి బిడ్డకు దక్కిన గౌరవమని ఆమె వ్యాఖ్యానించారు.
అనిల్ నియామకం పై తెలంగాణ ఎన్నారై సమాజం హర్షం వక్తం చేస్తుందన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారైలను అభివృద్ధిలో సైతం భాగం చేయడం గర్వంగా ఉందన్నారు.