జాతి గర్వించదగ్గ ఇంజినీర్ మోక్షగుండం: మహేశ్ బిగాల
మహేశ్ బిగాల | మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీరుగా దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు.

హైదరాబాద్: మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీరుగా దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. తన ఇంజినీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించారని, జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ అని చెప్పారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో అలుమ్ని అసోసియేషన్ తరపున జరిగిన ఇంజినీరింగ్ సెలబ్రేషన్స్‌లో మహేష్ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి (సెప్టెంబరు 15) సందర్భంగా ‘ఇంజినీర్స్ డే’గా జరుపుకుంటున్నామని చెప్పారు.
ఇంజినీరింగ్ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారని చెప్పారు. ఆయన మార్గదర్శకత్వంలో చేపట్టిన నిర్మాణాలు నేటికీ చెక్కుచెదరలేదంటే అతిశయోక్తి కాదన్నారు. దేశంలోని యువ ఇంజినీర్లు దేశాన్ని నిర్మిస్తున్నారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్పూర్తితో ఇంకా ముందుకు వెళ్లాలని సూచించారు.
అనంతరం బిగాల కృష్ణమూర్తి ఫౌండేషన్ తరపున కాలేజీలో అత్యంత ప్రతిభ కనబర్చిన వారికి, టీఎస్ ఈసెట్‌లో మంచి ర్యాంక్స్ సాధించినవారికి ఉపకార వేతనాలు అందిస్తామని ప్రకటించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బదిలీ
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

