చికాగోలో వైభవంగా ‘తానా’ మహిళా దినోత్సవ వేడుకలు
చికాగోలో మార్చి 12న తానా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ఉమా ఆరమండ్ల కటికి (తానా మహిళా సర్వీసెస్ కో ఆర్డినేటర్) ఆధ్వర్యంలో మిడ్ వెస్ట్లో ప్రప్రథమంగా ‘తానా’ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ‘తానా’ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ‘తానా’ కమ్యూనిటీ కోఆర్డినేటర్ రాజా కసుకర్తి, ‘తానా’ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ, ‘తానా’ ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తం చౌదరి గుడే , ‘తానా’ మీడియా చైర్ శ్రీటాగోర్ మలినేని, ‘తానా’ రీజినల్ రిప్రజెంటేటివ్, సౌత్ యూనిట్ శ్రీ కిషోర్ యార్లగడ్డ, నేషనల్ కో చైర్స్ వెంకట్ బిత్రా, రామకృష్ణ కృష్ణస్వామి, ఫణి వేగుంట తదితరులు హాజరయ్యారు. చికాగో లోకల్ లీడర్స్ హేమ కానూరు, యుగందర్ యడ్లపాటి, శ్రీ కృష్ణ మోహన్, రజినీ ఆకురాతి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ కౌన్సిల్ జనరల్ అమిత్ కుమార్, సురభి కుమార్, అదే విధంగా కాంగ్రెస్ మ్యాన్ రాజా కృష్ణమూర్తి, స్టేట్ సెనెటర్ రామ్ విల్లివాలమ్ హాజరై మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమంలో డాక్టర్ ఉమా ఆరమండ్ల కటికి చికాగోలో కీలకమైన పదవులలో ఉన్న మహిళా లీడర్స్ ను శాలువాలతో సత్కరించి సన్మానించారు. అలాగే, అనాథ భాలికల కోసం ‘తానా’ ఫౌండేషన్ ప్రోగ్రాం ‘చేయూత’కి 1700 డాలర్లను సైతం సేకరించారు.

సన్మానం అనంతరం మహిళలు అందరూ అదే వేదికపై గ్లామర్ ర్యాంప్ వాక్ లతో సందడి చేశారు. క్రియేటివ్ ఐడియాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫ్యాషన్ షో అందరినీ అమితంగా ఆకర్షించింది. తర్వాత డాన్స్ ఫ్లోర్ ఓపెన్ కావడంతో మహిళలు ఉత్సాహంగా డ్యాన్సులు చేసి ఎంజాయ్ చేశారు. ప్రణతి త్రిపుర యాంకరింగ్ ఈ వేడుకలో అందరినీ ఆకర్షించింది.

ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన వారందరికీ ఉమా ఆరమండ్ల కటికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా హేమ అద్దంకి, ప్రణతి, శాంతి లక్కంసని, శ్రీలత గరికపాటి, సంధ్య అద్దంకి, అనిత కాట్రగడ్డ, శ్రీదేవి దొంతి, కిరణ్ వంకాయపాటి, శ్రీ గురు స్వామికి ప్రత్యేక థ్యాంక్స్ చెప్పారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

