NRI BRS UK : లండన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao)తో ఎన్నారై బీఆర్ఎస్ యూకే ప్రతినిధులు భేటీ అయ్యారు. వెస్ట్ లండన్‌లో మాజీ మంత్రితో శుక్రవారం ” మీట్ & గ్రీట్ ” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకేలోని ఎన్నారైలు, హరీష్ రావు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి (Naveen Reddy) నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యనాయకులు రవి ప్రదీప్ పులుసు, సురేష్ గోపతి అధ్యక్షత వహించారు.
కార్యక్రమం ప్రారంభంలో మహనీయుడు అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు, అమరవీరుల స్థూపానికి పూలతో నివాళులు అర్పించారు. అనంతరం అమరులన స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు రాజకీయ ప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక వీడియో ప్రదరిశించారు నిర్వాహకులు. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు పోషించిన పాత్రను కళ్లకుకట్టిన ఆ వీడియో ప్లే అవుతున్నంత సేపు ఎన్నారైల కేరింతలు, చప్పట్లు, ఈలలతో హాల్ మొత్తం మార్మోగింది. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమం, స్వరాష్ట్ర కల సాకారం నుండి ఇప్పటివరకూ ఎన్నారై బీఆర్ఎస్ యూకే పోషించి పాత్ర గొప్పదని, ఎందరికో ఆదర్శమని ప్రశంసించారు.
ప్రస్తుతం తెలంగాణలో అసమర్ధ పాలన సాగుతోందని.. అభివృద్ధి కుంటుపడి తెలంగాణ మళ్లీ 20 సంవత్సరాలు వెనక్కి పోతుందని హరీశ్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షా రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నాడని, ఆరు గ్యారంటీలతో పాటు అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని లెక్కలతో సహా ఎన్నారైలకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఎన్నారైలకు అవగాహన కలిగించారు హరీశ్ రావు. ఈ ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణల గురించి ఎన్నారైలకు వివరించారు ఎమ్మెల్యే. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే తరాల కోసం అలోచించి చేపట్టి ఎన్నో కార్యక్రమాల గురించి హరీశ్ రావు సభకు వెల్లడించారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటేనే తెలంగాణకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. అన్ని వేళా అందరం కేసీఆర్ వెంటే ఉండాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.
ప్రసంగిస్తున్న హరీశ్ రావు
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి, అడ్వైజరీ బోర్డు చైర్మన్ సీక చంద్ర శేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవి కుమార్ రేటినేని, మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, శ్రీకాంత్ జెల్ల, అడ్వైజరీ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ వీర, మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి – ఐటీ, మీడియా – పీఆర్ రవి ప్రదీప్ పులుసు, కార్యదర్శులు మల్లా రెడ్డి, అబూ జాఫర్, సురేష్ గోపతి, కోశాధికారి సురేష్ బుడగం, లండన్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి పింగలి, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి, కమ్యూనిటీ అఫైర్స్ వైస్ చైర్మన్ శ్రీధర్ రావు తక్కలపల్లి, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, కార్యదర్శి – యూత్ వింగ్, ప్రశాంత్ మామిడాల, మెంబర్షిప్ కో ఆర్డినేటర్: అంజన్ రావు, ఈవెంట్స్ ఇంచార్జ్, తరుణ్ లునావత్, ఇస్మాయిల్ (అబ్బు), ముఖ్య సభ్యులు ప్రశాంత్, అజయ్, అంజన్, తరుణ్ లూనావత్, పవన్ కుమార్ గౌడ్ తదితరలు పాల్గొన్నారు