హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఫిలిం అండ్ టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించబడ్డ అనిల్ కూర్మాచలంకు డెన్మార్క్ టీఆర్ఎస్ ఫౌండర్ శ్యామ్ ఆకుల శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందనడానికి అనిల్‌కు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడమే నిదర్శనమని శ్యామ్ పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసేవారికి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుందన్నారు. అనిల్‌పై నమ్మకం ఉంచి కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు శ్యామ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎనిమిదేండ్లలో టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందని శ్యామ్ పేర్కొన్నారు.