Deepavali Celebrations : తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో దీపావళి పండుగ (Deepavali Festival)ను అత్యంత వైభవంగా నిర్వహించారు. భారత దౌత్యకార్యాలయం సాంస్కృతిక కార్యదర్శి రాజేంద్ర కుమార్ (Rajendra Kumar) ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతిప్రజ్వలనతో జ్యూరిక్ నగరంలో వేడుకలను ప్రారంభించారు. ఈ పండుగలో తెలుగువారి సంప్రదాయాలు, సాంస్కృతిక పరంపరలు అత్యంత ఘనంగా ప్రదర్శించారు. పెద్దల నుంచి పిల్లల వరకు 300 మంది తెలుగు వాళ్ళు పాల్గొని ఆనందపు వెలుగులను పంచుకున్నారు.
జురిక్ నగరంలో దీపావళి సంబురాలు విజయవంతం కావడంలో తెలుగు అసోసియేషన్ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు కిషోర్ కుమార్ తాటికొండ, కార్యనిర్వాహక మండలి – రామారావు పొడుగు, హరీష్ చింతారెడ్డి, స్వాతి కొప్పుల, ఉజ్వల పెంటపాటి, సురేష్ దేవరశెట్టి, పవన్ సోమిశెట్టి, స్వచ్ఛంద కార్యకర్తల కృషి అభినందనీయం. ఈ వేడుకల్లో కార్యనిర్వాహక మండలి చివరిగా చేసిన నృత్య ప్రదర్శన తెలుగువారందరి మనసులు దోచుకోవడమే కాదు అందరినీ మంత్రముగ్ధులను చేసింది.
నృత్య ప్రదర్శన ఇస్తున్న చిన్నారులు
