బీఆర్ఎస్ యూఎస్ఐ ఆధ్వర్యంలో రజతోత్సవ, తెలంగాణ అవతరణ దినోత్సవం సన్నాహక సమావేశం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం పురస్కరించుకుని బీఆర్ఎస్ యూఎస్ఏ యువజన విభాగం ఆధ్వర్యంలో డాలస్ నగరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వందలాది మంది యువత, విద్యార్థులు, యువజన నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం పురస్కరించుకుని బీఆర్ఎస్ యూఎస్ఏ యువజన విభాగం ఆధ్వర్యంలో డాలస్ నగరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వందలాది మంది యువత, విద్యార్థులు, యువజన నాయకులు పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్, ఎల్బీనగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. పేదల కోసం, గ్రామాల కోసం, రైతుల కోసం విప్లవాత్మక మార్పులు, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్, కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తెలంగాణకు నీటిని తెచ్చిన విజనరీ నాయకుడిగా కేసీఆర్‌ను ఆయన ప్రశంసించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచిన ఘనత కేసీఆర్‌దే అని అన్నారు. ఆయన నాయకత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందని తెలిపారు.
ఈ సన్నాహక సమావేశాల్లో మాజీ ప్రభుత్వ విప్ రసమయి బాలకిషన్ తన గానంతో సభికులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్, గాదరి కిశోర్, పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గ్యాదరి బాలమల్లు, జాన్సన్ నాయక్, ముఠా జయసింహ, పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఆశిష్ యాదవ్, అభిలాష్ రంగినేని పాల్గొన్నారు.

కాగా, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల మాట్లాడుతూ.. కేసీఆర్ దూరదృష్టిని కొనియాడుతూ యువతతో ఘనంగా సమావేశాన్ని నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ యూఎస్ఏ సమన్వయకర్త తన్నీరు మహేశ్ మాట్లాడుతూ.. జూన్ 1న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ యూఎస్ఏ యువ నాయకులు ఉదయ్ యాదవ్, సామ్ పుసపల్లి, శశి దొంతినేని, అనిల్ పెండ్యాల తదితరులు సమర్థవంతంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఈ కార్యక్రమానికి విశేష ఆకర్షణగా నిలిచింది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

