BRS UK | ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన నేపథ్యంలో నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడటం సమంజసం కాదని, ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
ఈ పిరికిపంద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బీఆర్ఎస్ పార్టీ అదరదు.. బెదరదనీ, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే వుంటామని, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడులు జరిపిన కాంగ్రెస్ గూండాలను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని నవీన్ రెడ్డి డిమాండ్ చేశారు.
SI Srinivas | యువత భవిష్యత్తు గంజాయితో నాశనం : ఎస్సై శ్రీనివాస్
MLA Kova Laxmi | మహంకాళి జాతరలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు
Hanuman Jayanti | భక్తిశ్రద్ధలతో ఘనంగా హన్మాన్ జయంతి వేడుకలు