BRS Switzerland : బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు, ఎన్నారై నాయకులు మహేష్ తన్నీరు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు (Satyanarayana Rao) పరమపదించడం పట్ల బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు శ్రీధర్ గందె (Sridhar Gande), ఇతర కార్యవర్గం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ విషాద సమయంలో హరీష్ రావు, మహేష్ , వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సత్యనారాయణ రావు ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని వారు భగవంతుడిని మనసారా కోరుకున్నారు.