Anil Kurmachalam | ఇలాంటి దాడులు ఎన్ని చేసినా బీఆర్ఎస్ నాయకులను భయపెట్టలేరు.. బండి సంజయ్కు అనిల్ కూర్మాచలం హెచ్చరిక
Anil Kurmachalam | ఇప్పటికే కరీంనగర్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ పట్టణంలో పరిస్థితి ఇలా ఉండడం దారుణమన్నారు ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం.
Anil Kurmachalam | లండన్ : కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనుచరుల దాడిని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు.
ఇప్పటికే కరీంనగర్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ పట్టణంలో పరిస్థితి ఇలా ఉండడం దారుణమన్నారు. ఇప్పుడు వారి అనుచరులు బీజీపీ గుండాలు పట్ట పగలు ఇలా దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని అనిల్ కూర్మాచలం ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి చట్టబద్ధంగా, కఠినంగా శిక్షించాలని ఎన్నారైల పక్షాన అనిల్ కూర్మాచలం పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో అనిల్ కూర్మాచలం ఫోన్లో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ ఇలాంటి దాడులు ఎన్ని చేసినా బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయపెట్టలేరని, కేసీఆర్, కేటీఆర్ సైనికులమని రానున్న రోజుల్లో ఓటుతో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెంట మేమున్నామని.. ఎన్నారైలంతా వారి వెంటే ఉన్నారని.. ఇలాంటి పిరికిపంద చర్యలని మానుకోవాలని బండి సంజయ్కు అనిల్ కూర్మాచలం హితవు పలికారు.
Read Also :
Karimnagar | కరీంనగర్లో రెచ్చిపోయిన బీజీపీ గూండాలు..ఎమ్మెల్యే గంగుల ఆఫీస్పై దాడి : వీడియో
Agadha | షూటింగ్లో పాము కాటేసినా వనిత భయపడలేదు : ఎం.ఎస్. రాజు షాకింగ్ కామెంట్స్!
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

