న్యూఢిల్లీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) స్టెనోగ్రాఫర్, డైరెక్టర్, ఇతర పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 115 పోస్టులను భర్తీ చేయనున్నది. ఇందులో గ్రూప్ ఏ, బీ, సీ కేటగిరీ పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 115
ఇందులో డైరెక్టర్ 1, జూనియర్ డైరెక్టర్ 1, డిప్యూటీ డైరెక్టర్ 1, అసిస్టెంట్ ఆఫీసర్ 1, అకడమిక్ ఆఫీసర్ 1, రిసెర్చ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీసర్ 1, సెక్షన్ ఆఫీసర్ 7, అసిస్టెంట్ ఇంజినీర్ 1, హిందీ ఆఫీసర్ 1, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 1, ఈడీపీ సూపర్వైజర్ 37, జూనియర్ ఇంజినీర్ 1, అసిస్టెంట్ 4, స్టెనోగ్రాఫర్ 3, జూనియర్ అసిస్టెంట్ 36 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 10
వెబ్సైట్: https://nios.ac.in/