National Informatics Centre Recruitment | సైంటిఫిక్, సైంటిస్ట్-బి (Scientist-B), టెక్నికల్ (Technical Assistant-A) పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ ప్రకటన గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 598 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 598
పోస్టుల వివరాలు :
1. సైంటిస్ట్-బి: 71 పోస్టులు
2. సైంటిఫిక్ ఆఫీసర్/ ఇంజినీర్: 196 పోస్టులు
3. సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్: 331 పోస్టులు
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం
వయస్సు : 30 ఏండ్లు మించకుడదు.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
దరఖాస్తు ఫీజు: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు)
దరఖాస్తు ప్రారంభ తేదీ: మార్చి 04
చివరి తేదీ : ఏప్రిల్ 04
వెబ్సైట్: https://www.nic.in/