Last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force), హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ (HOCL), దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC)లు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు రేపటితో ముగియనుంది.
1.CRPF Recruitment | సీఆర్పీఎఫ్లో 212 ఇన్స్పెక్టర్ పోస్టులు
CRPF Recruitment 2023 | నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్ విభాగాలలో, సబ్-ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ తదితర పోస్టుల భర్తీకి డైరెక్టరేట్ జనరల్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 212
పోస్టులు : సబ్-ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయస్సు : ఎస్సై పోస్టులకు 30 ఏండ్లు, ఏఎస్సై పోస్టులకు 18 నుంచి 25 ఏండ్లలోపు ఉండాలి.
జీతం: రూ.29,200 నుంచి రూ.1,12,400 వరకు
దరఖాస్తు ఫీజు : ఎస్సై పోస్టులకు రూ.200, ఏఎస్సై పోస్టులకు రూ.100 ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు.
ఎంపిక : రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్.
దరఖాస్తులు ప్రారంభం: మే 01
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: 21/05/2023. మే 21
అడ్మిట్ కార్డ్ విడుదల :జూన్ 13
వెబ్సైట్ : rect.crpf.gov.in
2. HOCL Recruitment | హెచ్ఓసీఎల్లో మేనేజర్ పోస్టులు
డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ (హెచ్ఓసీఎల్) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 08
పోస్టులు: డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్లు.
విభాగాలు: మానవ వనరుల విభాగం, లీగల్, మెకానికల్, మెటీరియల్స్, సిస్టమ్స్.
అర్హతలు: పోస్టులను బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ, ఎల్ఎల్బీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎల్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఐఆర్పీఎం, పీజీడీపీఎం ఉత్తీర్ణతతో పాటు 3 నుంచి 12 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: 35 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.20600 నుంచి రూ.62000
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, టెస్ట్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: మే 21
వెబ్సైట్ : https://www.hoclindia.com/
3. DVC Recruitment 2023 | దామోదర్ వ్యాలీలో 52 పోస్టులు
DVC Recruitment 2023 | పశ్చిమ్ బెంగాల్ (West Bengal), ఝార్ఖండ్ (jharkhand) రాష్ట్రాల్లోని ప్లాంట్లలో అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి కోల్‌కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీ, కమ్యూనికేషన్స్, హెచ్ఆర్, సీఎస్ఆర్, పీఆర్ తదితర విభాగాలలో ఖాళీలను డీవీసీ భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 52
పోస్టులు : అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
విభాగాలు : ఐటీ, కమ్యూనికేషన్స్, హెచ్ఆర్, సీఎస్ఆర్, పీఆర్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 45 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.56,100.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 21
వెబ్సైట్ : www.dvc.gov.in