IRCON Recruitment 2023 | వర్క్స్ ఇంజినీర్ (Works Engineer posts) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (IRCON) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, S&T తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఒక యేడాది పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 34
పోస్టులు : వర్క్స్ ఇంజినీర్
విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్, S&T తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఒక యేడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.36000
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఎంపిక
ఇంటర్వ్యూ వేదిక: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం సంబంధిత కార్యాలయాల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 26 వరకు.
వెబ్సైట్ : ircon.org