Indian Navy Agniveer SSR Recruitment 2023 | కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ.. అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ నేవీ (సీనియర్ సెకండరీ రిక్రూట్) పోస్టులకు సంబంధించి ప్రకటన విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే (పెళ్లికాని) మహిళ, పురుష అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సబ్జెక్టులతో ఇంటర్ (10+2) ఉత్తీర్ణత/ ఇంటర్ ( బయాలజీ/ కంప్యూటర్ సైన్స్) లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.. ఆన్లైన్ దరఖాస్తులు మే 29 నుంచి ప్రారంభమవుతుండగా.. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జూన్ 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 1365 (పురుషులు-1,120, మహిళలు-273)
పోస్టుల వివరాలు : ఇండియన్ నేవీ – సీనియర్ సెకండరీ రిక్రూట్
అర్హతలు : కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత (10+2)/ ఇంటర్ ( బయాలజీ/ కంప్యూటర్ సైన్స్) లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వయస్సు : 01.11.2002 నుంచి 31.04.2005 మధ్య పుట్టి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.550. (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు)
దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 29
చివరి తేదీ : జూన్ 15
వెబ్సైట్: https://indiannavy.nic.in/