IIT Hyderabad Recruitment | నానో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీ, నానో బయోటెక్నాలజీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో రిసెర్చ్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పోస్టులు: రిసెర్చ్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు.
విభాగాలు : నానోఎలక్ట్రానిక్స్, నానోటెక్నాలజీ, నానోబయోటెక్నాలజీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ తదితరాలు.
దరఖాస్తు : ఈమెయిల్ ద్వారా
ఈ-మెయిల్ : fendlabiith@gmail.com
వయస్సు : 28 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.31000 నుంచి రూ.47000 వరకు
చివరితేదీ: జూలై 20
వెబ్సైట్: https://iith.ac.in