అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్స్‌రెన్స్ సెక్టర్లో రెండేళ్ల పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 28వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 600 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఆన్లైన్ టెస్టు, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 600
పోస్టు : అసిస్టెంట్ మేనేజర్
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్స్‌రెన్స్ సెక్టర్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు : 21-30 మధ్య ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ టెస్టు, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : ఫిబ్రవరి 28
వెబ్సైట్ : https://www.idbibank.in/