న్యూఢిల్లీ: భారత వాయుసేన (ఐఏఎఫ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులు ఈ నెల 29 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిపికేషన్ ద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఎల్డీసీ, ఎంటీఎస్, సీఎంటీడీ వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 80
ఇందులో సూపరింటెండెంట్ (స్టోర్) 1, ఎల్డీసీ 10, కుక్ 4, కార్పెంటర్ 1, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ 45, ఫైర్‌మ్యాన్ 1, మల్టీటాస్కింగ్ స్టాఫ్ 18 చొప్పున ఉన్నాయి.
అర్హత: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అయితే అభ్యర్థులు డిగ్రీ, మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవాలి. 18 నుంచి 25 ఏండ్ల వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్. ఎంప్లాయ్మెంట్ న్యూస్‌లో నోటిఫికేషన్ (అక్టోబర్ 30- నవంబర్ 5 సంచిక) ప్రచురితమైన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 29
వెబ్సైట్: indianairforce.nic.in