e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home News Job news | డీఆర్‌డీవోలో ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

Job news | డీఆర్‌డీవోలో ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా ట్రేడ్‌ అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చేనెల 1 నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 116 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఈ పోస్టులు కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఈసీఈ, ఈఈఈ, సివిల్‌ ఇంజినీరింగ్, సినిమాటోగ్రఫీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌ వంటి విభాగాల్లో ఉన్నాయి. బీఈ, బీటెక్‌, డిప్లొమా, ఐటీఐ చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం అప్రెంటిస్‌లు: 116
ఇందులో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు 60, డిప్లొమా అప్రెంటిస్‌లు 30, ఐటీఐ అప్రెంటిస్‌లు 26
అర్హతలు: బీఈ, బీటెక్‌, డిప్లొమా, ఐటీఐ చేసి ఉండాలి. 2019, ఆ తర్వాత ఉత్తీర్ణత సాధించినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్‌ 1
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్‌ 15
వెబ్‌సైట్‌: https://rac.gov.in.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement