AIIMS Jodhpur Recruitment | సీనియర్ రెసిడెంట్ (Senior resident) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అనాటమీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆప్తమాలజీ, పిడియాట్రిక్స్, న్యూరోసర్జరీ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, ఎండీఎస్, ఎంఎస్సీ, డీఎన్బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. జూలై 21 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 121
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ పోస్టులు
విభాగాలు : అనాటమీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆప్తమాలజీ, పిడియాట్రిక్స్, న్యూరోసర్జరీ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్, ఎండీఎస్, ఎంఎస్సీ, డీఎన్బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 45 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.25350
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జూలై 21
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
వెబ్సైట్ : https://www.aiimsjodhpur.edu.in/